Blackheads | బ్లాక్ హెడ్స్ సమస్య ఇబ్బంది పెడుతుందా..? ఈ నాచురల్ టిప్స్‌ను పాటించి చూడండి..!

Follow

Blackheads | బ్లాక్ హెడ్స్ సమస్య అనేది ప్రస్తుతం కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వస్తోంది. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కుపై కనిపిస్తుంటాయి. ఆ ప్రాంతంలో ఉండే చర్మ రంధ్రాల్లో వెంట్రుకలకు చెందిన కణాలు, నూనె, మృత చర్మ కణాలు, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఇవి గాలితో చర్య పొంది ఆక్సీకరణ చెందుతాయి. దీంతో నల్లగా మారుతాయి. వీటినే బ్లాక్ హెడ్స్ అంటారు. బ్లాక్ హెడ్స్ ఉంటే అసలు ముఖం బాగుండదు. అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే బ్లాక్ హెడ్స్‌ను తగ్గించుకునేందుకు గాను ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలు అవసరం లేదు. మనకు ఇంట్లో లభించే పదార్థాలతోనే అత్యంత సహజ సిద్ధంగా బ్లాక్ హెడ్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బేకింగ్ సోడా..
బ్లాక్ హెడ్స్ సమస్యను తగ్గించుకునేందుకు చిట్కాలను పాటించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. తరువాతే ఏ చిట్కాను అయినా పాటించాల్సి ఉంటుంది. లేదంటే బ్లాక్ హెడ్స్ సులభంగా పోవు. ముందుగా ముఖానికి 5 నుంచి 10 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్‌ను సులభంగా తొలగించుకోవచ్చు. తరువాత ఏ చిట్కాను అయినా సరే పాటించాల్సి ఉంటుంది. ఇక బ్లాక్ హెడ్స్‌ను తొలగించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మృత చర్మ కణాలను తొలగించి బ్లాక్ హెడ్స్ లేకుండా చేస్తుంది. ఇందుకు గాను 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను తగినంత నీటితో కలిపి మెత్తని పేస్ట్‌లా మార్చాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. కనీసం 1 నిమిషం పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. 5 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే బ్లాక్ హెడ్స్ ఉండవు.
తేనె, పాలు..
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండింటి మిశ్రమం బ్లాక్ హెడ్స్‌ను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టీస్పూన్ పాలను తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఒక పొరలాగా అప్లై చేయాలి. దానిపై ఒక కాటన్ స్ట్రిప్ లేదా శుభ్రమైన వస్త్రాన్ని ఉంచాలి. 15 నిమిషాలు అయ్యాక స్ట్రిప్ లేదా వస్త్రాన్ని తీసేయాలి. దీతో బ్లాక్ హెడ్స్ వచ్చేస్తాయి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే కోడిగుడ్డు తెల్ల సొన కూడా బ్లాక్ హెడ్స్‌ను తొలగిస్తుంది. కోడిగుడ్డు తెల్లసొనను నేరుగా బ్లాక్ హెడ్స్‌పై అప్లై చేయాలి. మీద ఒక టిష్యూ పేపర్‌ను ఉంచాలి. మళ్లీ మీద కొద్దిగా సొన వేయాలి. ఇలా 2 నుంచి 3 పొరలు వేయాలి. తరువాత 20 నిమిషాలు ఆగి తీసేయాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ చిట్కాను వారంలో ఒకసారి పాటించినా చాలు, బ్లాక్ హెడ్స్ ఉండవు.
ముల్తానీ మట్టి, రోజ్ వాటర్..
బ్లాక్ హెడ్స్‌ను తొలగించడంలో తేనె, నిమ్మరసం, చక్కెర మిశ్రమం కూడా పనిచేస్తుంది. 1 టేబుల్ స్పూన్ తేనెలో 1 టీస్పూన్ చక్కెర, అర చెక్క నిమ్మరసం వేసి కలిపి ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్‌పై రాయాలి. 1 నుంచి 2 నిమిషాల పాటు బ్లాక్ హెడ్స్‌పై మర్దనా చేయాలి. 5 నుంచి 10 నిమిషాలు అయ్యాక తీసేయాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమం కూడా బ్లాక్ హెడ్స్‌ను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని వారంలో 2 సార్లు వాడవచ్చు. అలాగే ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్‌లా మార్చాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్‌పై అప్లై చేయాలి. 10 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. వారంలో ఒకసారి ఈ చిట్కాను పాటిస్తుంటే బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇలా ఈ నాచురల్ టిప్స్‌ను పాటిస్తే బ్లాక్ హెడ్స్‌ను సులభంగా తొలగించుకోవచ్చు.
బ్లాక్ హెడ్స్ సమస్య అనేది ప్రస్తుతం కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వస్తోంది. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కుపై కనిపిస్తుంటాయి.