Body Warming Foods | చల్లని వాతావరణంలో శరీరం వేడిగా ఉండాలంటే ఈ ఆహారాలను తినండి..!

Follow

Body Warming Foods | చలికాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. మేఘావృతమై ఉన్నా లేదా వర్షాలు పడుతున్నా కూడా వాతావరణం చల్లగా ఉండి మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. అయితే ఎక్కువ సేపు వాతావరణం చల్లగా ఉంటే మనం తట్టుకోలేము. పైగా చల్లని వాతావరణం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందువల్ల ఈ సీజన్‌లో మనం తినే ఆహారం మన శరీర వేడిని పెంచేది అయి ఉండాలి. అలాగే రోగ నిరోధక శక్తిని సైతం పెంచేదిగా ఉండాలి. అలాంటి ఆహారాలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు మనం కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకుంటే పలు ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. శరీరానికి పోషకాలు, శక్తి లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ఈ సీజన్‌లో తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్లెట్స్..
వర్షాకాలంలో మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు, కొర్రలు, ఊదలు తదితర చిరు ధాన్యాలను ఏదో ఒక విధంగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. పైగా ఈ ధాన్యాలను తినడం వల్ల ఫైబర్, మెగ్నిషియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ మనకు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ చిరు ధాన్యాలను మనం రోటీ, కిచిడీ, సూప్‌ల రూపంలో తీసుకోవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా వేడి వేడి ఓట్ మీల్‌ను తింటే ఎంతగానో ప్రయోజనం లభిస్తుంది. ఇది ఫైబర్, జింక్ వంటి పోషకాలను సైతం అందించి ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తుంది. బ్రౌన్ రైస్‌ను కూడా తినవచ్చు. ఇందులో ఉండే సంక్లిష్టమైన పిండి పదార్థాలు, ఫైబర్ శరీరానికి వెచ్చదనం అందిస్తాయి. కినోవా, బార్లీ, బక్‌వీట్ వంటి తృణ ధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది.
గింజలు, విత్తనాలు..
చిలగడదుంపలు, ఆలుగడ్డలు, క్యారెట్లు, ముల్లంగి, బీట్‌రూట్ వంటి కూరగాయలను తింటున్నా కూడా ఫలితం ఉంటుంది. వీటిల్లో సంక్లిష్టమైన పిండి పదార్థాలు, ఫైబర్, బీటా కెరోటిన్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ కూడా లభిస్తాయి. దీంతో పోషకాహార లోపం పోతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరం వెచ్చగా కూడా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. నెయ్యి ఈ జాబితాకు చెందుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రోజూ ఆహారంలో ఒక టీస్పూన్ నెయ్యిని తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే బాదంపప్పు, వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా, నువ్వులు, పల్లీలు, పొద్దు తిరుగుడు విత్తనాలను తింటుండాలి. ఇవన్నీ ఎన్నో పోషకాలను అందించడంతోపాటు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సహాయం చేస్తాయి.
ప్రోటీన్లు..
ప్రోటీన్లు అధికగా ఉండే ఆహారాలను తింటుండాలి. కోడిగుడ్లు, చేపలు, చికెన్, మటన్, పప్పు దినుసులు, చీజ్ వంటి ఆహారాలను తింటే పోషకాలు లభిస్తాయి. ప్రోటీన్లు లభించి శరీరానికి శక్తి అందుతుంది. శరీరం వెచ్చగా ఉంటుంది. అయితే ఈ ఆహారాలను స్వల్ప మోతాదులో తినాలి. లేదంటే వేడి చేసే ప్రమాదం ఉంటుంది. ఇవే కాకుండా భోజనం చేసే ముందు అల్లం రసం సేవిస్తుండాలి. దాల్చిన చెక్క కూడా మేలు చేస్తుంది. పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు, కారం, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, వాము వంటి ఆహారాలను ఈ సీజన్‌లో తింటుండాలి. ఇవన్నీ మన శరీర రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పైగా శరీరం వెచ్చగా కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు రోగాలు రాకుండా రక్షిస్తాయి.
చలికాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. మేఘావృతమై ఉన్నా లేదా వర్షాలు పడుతున్నా కూడా వాతావరణం చల్లగా ఉండి మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. అయితే ఎక్కువ సేపు వాతావరణం చల్లగా ఉంటే మనం తట్టుకోలేము.