Bomb threat | ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. రియాద్‌కు దారి మళ్లింపు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Air India Flight

Bomb threat : బర్మింగ్‌హామ్‌ (Birmingham) నుంచి ఢిల్లీ (Delhi) కి బయిలుదేరిన ఎయిరిండియా (Airindia) విమానానికి బాంబు బెదిరింపు (Bomb threat) కాల్‌ వచ్చింది. దాంతో విమానాన్ని రియాద్‌ (Riyadh) కు దారి మళ్లించారు. రియాద్‌ విమానాశ్రయంలో దిగిన అనంతరం ప్రయాణికులను సేఫ్‌గా బయటికి తీసుకెళ్లారు. ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీ చేసి బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

AI-114 నెంబర్‌ గల ఎయిరిండియా విమానం శనివారం రాత్రి 8.26 గంటలకు బర్మింగ్‌హామ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఆ తర్వాత విమానంలో బాంబు పెట్టినట్లు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ విమానాన్ని అత్యవసరంగా రియాద్‌కు దారి మళ్లించారు. రియాద్‌ విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ కాగానే ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకెళ్లారు.

విమానంలో బాంబు కోసం భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. కానీ అందులో ఎలాంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు రియాద్‌లోని ఓ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విమానం రియాద్‌లోని కింగ్‌ ఖాలీద్‌ అంతర్జాతీయ విమనాశ్రయంలో ఉంది.

Read More >>

ఇరాన్‌ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్‌

ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగే ఛాన్స్‌.. అమెరికాలోని పలుచోట్ల హై అలర్ట్‌

‘పహల్గాం’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు అరెస్ట్‌

అమెరికా మొదలు పెట్టింది.. మేం అంతం చేస్తాం : ఇరాన్‌

​Bomb threat | బర్మింగ్‌హామ్‌ (Birmingham) నుంచి ఢిల్లీ (Delhi) కి బయిలుదేరిన ఎయిరిండియా (Airindia) విమానానికి బాంబు బెదిరింపు (Bomb threat) కాల్‌ వచ్చింది. దాంతో విమానాన్ని రియాద్‌ (Riyadh) కు దారి మళ్లించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *