Bonakal : వ్యవసాయ భూమి హద్దులు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళల ధర్నా
Follow

బోనకల్లు, జూన్ 23 : తన భూమికి చెందిన హద్దులను కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారని ముగ్గురు మహిళలు రోడ్డెపై ధర్నా చేసిన సంఘటన బోనకల్లు మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు షేక్ మౌలాబి, నసీమా తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన షేక్ జానీ తన కూతురైన షేక్ మౌలాబీకి భూమిని ఇచ్చాడు. ఇటీవల షేక్ జానీ మృతి చెందాడు. కాగా చెల్లెలకు తండ్రి ఇచ్చిన భూమిలో తనకు కూడా వాటా రావాలంటూ అన్న మౌలాలి వాదనకు దిగాడు. దీంతో చెల్లెలకు అన్నకు మధ్య వివాదాలు తలెత్తి గ్రామ పెద్దలను ఆశ్రయించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో మౌలాబీ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి అన్న, అతని ఇద్దరి పిల్లలపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు బోనకల్లు ఎస్ఐ వెంకన్న కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై కక్ష కట్టిన అన్న తన చెల్లికి భూమి లేదు, తనకు బాకీ ఉంది ఎవరూ భూమిని కౌలుకు సాగు చెయొద్దని గ్రామంలో చెప్పాడు. కోర్టు ద్వారా వారికి నోటీసులు ఇప్పించాడు. అంతేకాకుండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరీదు రోశయ్య మౌలాబి వ్యవసాయ భూమికి చెందిన హద్దు రాళ్లను పీకివేసి గెట్లను దున్నివేశారు. దీంతో తన భూమిని కౌలుకు ఇచ్చుకోవడానికి అవకాశం లేకుండా చేసినటువంటి షేక్ మౌలాలిపై, గెట్టు రాళ్లు పీకేసీన మరీదు రోశయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నాని నిర్మించాలని సూచించారు. తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేపడతామని షేక్ మౌలాబి, ఆమె కూతురు నసీమాతో పాటు మరో మహిళ భీష్మించుకు కూర్చున్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు.
తన భూమికి చెందిన హద్దులను కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారని ముగ్గురు మహిళలు రోడ్డెపై ధర్నా చేసిన సంఘటన బోనకల్లు మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.