Boxer Mirza Ali: పంచ్ పడితే పతకమే.. జాతీయ పోటీల్లో బాక్స‌ర్ మీర్జా అలీ బేగ్ దూకుడు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Mirzaaliboxer

చార్మినార్‌: రింగ్ లొకి దిగి పంచ్ విసిరితే ప్రత్యర్థికి చుక్కలే.. చదువుల్లోనే కాదు.. ఆటల్లోను ముందు వరుసలో ఉంటామని నిరూపిస్తున్నారు పాత బ‌స్తీ విద్యార్థులు. మెరుగైన ప్రదర్శన ద్వారా క్రీడా లోకంలో గుర్తింపు సాధిస్తూ తోటి విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నారు. ఆటపై ఇష్టం.. నిరంతరం సాధన..ఓరిమితో కృషి చేసేవారి విజయ పరంపరకు ఆర్ధిక పరిస్ధితులు అడ్డురావని నిరూపిస్తున్నారు. ఒక‌వైపు ఆటల్లో దూసుకుపోతు.. మరోవైపు చదువులోను విశేషంగా రాణిస్తు అందరి చేతా ఔరా.. అనిపించేలా చేస్తున్నాడు మీర్జా ఆలీ బేగ్‌.

చిన్నతనం నుంచే మీర్జా అలీ బేగ్‌కు బాక్సింగ్ అంటే ఇష్టం. కొడుకు ఆసక్తి గుర్తించిన తండ్రి.. జాతీయ క్రీడాకారుడైన సయ్యద్‌ హాబీబ్‌ ముస్తాఫాను సంప్రదించాడు. మీర్జా అలీ బేగ్‌కు మెలకువలను నేర్పి అతన్ని ప్రోత్సహించాడు కోచ్‌. అవకాశాన్ని అందిపుచ్చుకున్న మీర్జా ఆలీబేగ్‌ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీలో పాల్గొని ప‌త‌కాలు గెలుచుకున్నాడు. కోచ్ హాబీబ్ నమ్మకాన్ని నిలకబెట్టాడు. బరిలో దిగిన ప్రతి బౌట్‌లోనూ పతకాలు ఒడిసి పట్టాడు. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌, మేటి బాక్స‌ర్ నికత్ జరిన్ త‌ర‌హా బాక్సింగ్‌లో దూసుకుపోతు తెలంగాణ రాష్ట్ర పేరును జాతియ స్థాయిలో మెరిపిస్తున్నాడు.

పంచ్‌పడితే…!!

బాక్సింగ్‌ ప్రారంభించిన కొద్ది కాలంలోనే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గనే అవకాశం దక్కించుకున్నాడు మీర్జా ఆలీ బేగ్‌. తండ్రి నుంచి స్పూర్తి పొందిన ఇతడు ఎప్పటికప్పుడు తన ప్రతిభను మెరుగులు దిద్దుకుంటూ మరింతగా రాణించ‌డానికి పాఠశాల అనంతరం మిగిలిన సమయాన్ని సాధన కోసం కేటాయిస్తూ రాటుదేలుతున్నాడు. పాతబస్తీ బండ్లగూడ వద్దనున్న రౖెెసింగ్‌ సన్‌ హై స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న మిర్జా ఆలీ బేగ్‌, 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచే బాక్సింగ్‌లో సాధన ప్రారంభించాడు.

తండ్రి మీర్జా జావేద్‌ బేగ్‌, చెల్లి, ఇద్దరూ క్రీడల్లో ప్రతిభావంతులే. క్రీడకారులకు దక్కుతున్న గౌరవాన్ని దగ్గర నుంచి గమనించిన మీర్జా ఆలీ బేగ్‌ ఎలాగైన తనూ ఈ ఆటలో సత్తాచాటాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా అడుగులు వేసి రెండేళ్ల‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో తన సత్తా చాటాడు. మొదటి సంవత్సరమే బంగారు, కాంస్య పతాకం సాధించి తన పట్టుదలను నిరూపించాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ప్రతిభ చాటుతూ పలువురి ప్రంశలు అందుకుంటున్నాడు.

2025 జూన్‌ 19 నుంచి 25వరకు హార్యానా రాష్ట్రంలోని రోహాతక్‌లో జరిగిన జాతియ స్థాయి పోటీలో తెలంగాణ రాష్ట్రం తరుపున ప్రాతినిథ్యం వహిస్తు అండర్ 52, 54, కేజీ బరిలోకి దిగి కాంస్య పతకం అందుకున్నాడు. రాష్ట్ర స్థాయిలో జరిగిన అనేక పోటీలో పాల్గొని బంగారు పతకాలు సాధించాడు.

ఆటలో విజయం సాధించడానికి మెరుగైన ప్రదర్శన చేయడానికి నిర్ధిష్ట విధానం ఏమీ ఉండదు. పట్టుదల, అంకితభావంతో ప్రయత్నిస్తే ఏ క్రీడల్లోనైనా విజయాలను సాధించవచ్చు, క్రీడల్లో గెలుపోటములు జీవితంలో కూడా ఎన్నో పాఠాలు నేర్పుతాయని కోచ్ హాబీబ్ అన్నారు.

​Boxer Mirza Ali: బాక్సర్ మీర్జా అలీ బేగ్‌.. జాతీయ పోటీల్లో రాణిస్తున్నాడు. అత‌ను విసురుతున్న పంచ్‌ల‌కు ప‌త‌కాలు రాలుతున్నాయి. తాజాగా జాతీయ క్రీడ‌ల్లో అత‌ను కాంస్య ప‌త‌కాలు సాధించాడు. హైద‌రాబాద్‌లోని ఓల్డ్ సిటీకి చెందిన ఆ కుర్రాడు.. తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేస్తున్నాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *