Brahmaji | మంచు మోహన్ బాబుకి న్యూజిలాండ్‌లో 7 ఎక‌రాలు.. బ్ర‌హ్మాజీ కౌంట‌ర్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Moan

Brahmaji | గ‌త కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ క‌న్న‌ప్ప సినిమా ప్ర‌మోష‌న్స్‌తో పాటు ప‌లు వివాదాలతో వార్త‌ల‌లో నిలుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్ర‌స్తుతం మంచు మ‌నోజ్‌- విష్ణు గొడ‌వ కాస్త స‌ద్దుమ‌ణిగిన‌ట్టే క‌నిపిస్తుంది. అయితే మోహ‌న్ బాబు, విష్ణు గ‌త కొద్ది రోజులుగా క‌న్న‌ప్ప సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టారు. మూవీని జ‌నాల‌లోకి తీసుకెళ్లేందుకు గ‌ట్టిగానే ప్ర‌చారాలు చేస్తున్నారు. పలు నగరాల్లో కన్నప్ప కోసం ఈవెంట్లు నిర్వ‌హించారు. చివరగా హైదరాబాద్‌లో కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున చేశారు. మరికొద్ది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో సినిమాకి సంబంధించిన విశేషాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఇటీవ‌ల క‌న్న‌ప్ప ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా న్యూజిలాండ్‌లో టీం చిల్ అయిన ఓ వీడియోని బ్రహ్మాజీ షేర్ చేశారు. ఈ వీడియాలో మోహన్‌బాబు.. ఓ సువిశాల మైదానంలో నిల్చుని ఇదంతా నాది, విష్ణుదే.. అంటాడు. ఈ వీడియో తీస్తున్న బ్రహ్మాజీ.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వాళ్లు వింటున్నారుగా.. మొత్తం బ్లాక్‌మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని సరదాగా అంటాడు. దాంతో మోహన్‌బాబు.. మా దగ్గర బ్లాక్‌మనీయే లేదు. న్యూజిలాండ్‌లోని వనాకాలో ఓ ఇల్లు, 7000 ఎకరాలు కొన్నాం. ఇదంతా మనదే అని జోక్ చేయ‌గా, అంత‌లో ప్రభుదేవా అక్కడికి రావడంతో ప్రభుదేవాతో కలిసి ఏడు వేల ఎకరాలు కొన్నట్లు మాట మారుస్తాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మార‌డంతో దీనిపై జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ప్ర‌మోష‌న్ కోం స‌ర‌దాగా చేసిన వీడియోని కూడా ఇంత సీరియస్‌గా తీసుకుని వార్తలు రాస్తుండ‌డంతో బ్రహ్మాజీ స్పందించారు. నేను షేర్ చేసిన ఆ వీడియోలో మేం అంతా ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఏడు వేల ఎకరాలు అని అన్నాం. కొండలు కూడా కొనేశామని ఫన్నీగా చెప్పుకొచ్చాం. మేం అంతా అలా ఏదో సరదాగా ముచ్చట్లు పెట్టుకుని జోకులు వేసుకున్నాం.. కానీ ఇదంతా కూడా నిజం అని కొంత మంది న‌మ్మారు. న్యూజిలాండ్‌లో ఏడు వేల ఎకరాలు కొనడం అంత ఈజీ అనుకుంటున్నారా? అలా అయితే ప్రతీ వీకెండ్ అక్కడికి వెళ్లి షూటింగ్ చేసి వచ్చే వాళ్లం.. జోక్స్‌ని జోక్స్‌లా చూడండి.. కాని హెడ్ లైన్స్ చేయకండి.. ఎవ్వరూ ఏ ల్యాండ్ కొనలేదు.. నాన్ సిటీజెన్స్‌లను లాండ్ ఓనర్లు అయ్యేందుకు న్యూజిలాండ్ చట్టాలు ఒప్పుకోవు అంటూ బ్ర‌హ్మాజీ క్లారిటీ ఇచ్చారు.

​Brahmaji | గ‌త కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ క‌న్న‌ప్ప సినిమా ప్ర‌మోష‌న్స్‌తో పాటు ప‌లు వివాదాలతో వార్త‌ల‌లో నిలుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్ర‌స్తుతం మంచు మ‌నోజ్‌- విష్ణు గొడ‌వ కాస్త స‌ద్దుమ‌ణిగిన‌ట్టే క‌నిపిస్తుంది. అయితే మోహ‌న్ బాబు, విష్ణు గ‌త కొద్ది రోజులుగా క‌న్న‌ప్ప సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *