BSNL: ఫ్లాష్ సేల్.. రూ.400కే 400GB డేటా.. త్వరపడండి..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Bsnl Launches Flash Sale Get 400gb Data For Just Rs 400 Limited Time Offer

BSNL: భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం ఆకట్టుకునే డేటా ఆఫర్‌ ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ సొసైల్ మీడియా వేదికగా తెలిపిన సమాచారం మేరకు జూన్ 28 నుంచి జూలై 1, 2025 వరకు కేవలం నాలుగు రోజులపాటు వినియోగదారుల కోసం ఫ్లాష్ సేల్ ను బీఎస్ఎన్ఎల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ కింద వినియోగదారులకు రూ.400కి ఏకంగా 400GB డేటా లభించనుంది.

Read Also:Vivo X200 FE: ధరే కాదు భయ్యా.. ఫీచర్లు కూడా ఘనమే.. వివో నుంచి కొత్త మొబైల్ లాంచ్..!

అంటే, 1GB డేటా కేవలం రూ.1కు లభిస్తుందన్నమాట. ఇది హై-స్పీడ్ 4G డేటా కాగా, దీనికి 40 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే, ఈ ప్లాన్‌కు సర్వీస్ వ్యాలిడిటీ ఉండదు. ఈ ప్లాన్‌ను BSNL అధికార వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 90,000 4G టవర్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నెట్వర్క్ విస్తరణ, సామర్థ్యం మెరుగవుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.

Read Also:Viral Video: రైలులో ఒంటరిగా మహిళా యూట్యూబర్ ప్రయాణం.. కోచ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి ఏం చేశాడంటే..?

ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 5G సేవలు ప్రారంభించడానికి నేపథ్యంలో, అతి త్వరలో మరో లక్ష 4G/5G టవర్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గ అనుమతికి వేచి చూస్తోంది. అయితే, ప్రైవేట్ టెలికామ్ కంపినీలైన జియో, ఎయిర్‌టెల్, Viలతో పోటీలో నిలవాలంటే బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉన్నది.

​BSNL: భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం ఆకట్టుకునే డేటా ఆఫర్‌ ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ సొసైల్ మీడియా వేదికగా తెలిపిన సమాచారం మేరకు జూన్ 28 నుంచి జూలై 1, 2025 వరకు కేవలం నాలుగు రోజులపాటు వినియోగదారుల కోసం ఫ్లాష్ సేల్ ను బీఎస్ఎన్ఎల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ కింద వినియోగదారులకు రూ.400కి ఏకంగా 400GB డేటా లభించనుంది. Read Also:Vivo X200 FE: ధరే కాదు భయ్యా.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *