Bypoll Result | ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.. బీజేపీ రెండు చోట్ల.. ఆప్‌, కాంగ్రెస్‌, తృణమూల్‌ ఒక్కోచోట లీడ్‌లో

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Bypolls

Bypoll Result | నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలు (Assembly Bypolls) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లూథియానా (పంజాబ్)‌, కాళీగంజ్‌ (పశ్చిమబెంగాల్)‌, కాడి, విసవడర్‌ (గుజరాత్‌), నీలంబూర్‌ (కేరళ) స్థానాలకు ఈనెల 19న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో బీజేపీ రెండు స్థానాల్లో, ఆప్‌, కాంగ్రెస్‌, తృణమూల్‌ ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి. గుజరాత్‌లోని కడి, విసవడర్‌ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక కేరళలోని నీలంబూర్‌ స్థానంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, పంజాబ్‌లోని లూథియానాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు.

పంజాబ్‌లోని (Punjab) లూథియానాలో ఆప్‌ ఎమ్మెల్యే గురుప్రీత్‌ సింగ్‌ గోగి మరణించారు. దీంతో ఉపఎన్నిక బరిలో రాజ్యసభ ఎంపీ సంజీవ్‌ అరోరాను ఆప్‌ తన అభ్యర్థిగా నిలిపింది. ఇక కాంగ్రెస్‌ నుంచి భరత్‌ భూషన్‌ అషు, బీజేపీ నుంచి జైవాన్‌ గుప్తా పోటీ చేశారు. పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) కాళీగంజ్‌ టీఎంసీ ఎమ్మెల్యే నసీరుద్దీన్‌ అహ్మద్‌ మరణించారు. దీంతో ఆయన కుమార్తెను అధికార పార్టీ బరిలో నిలిపింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ స్థానాన్ని దక్కించుకుని తన బలాన్ని చాటుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది.

ఇక గుజరాత్‌లో (Gujarat) కాడి బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్‌భాయ్‌ సోలంకీ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అదేవిధంగా విసవడర్‌ ఆప్‌ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కేరళలో (Kerala) నీలాంబర్‌ స్థానం నుంచి గత ఎలక్షన్లలో కాంగ్రెస్‌ మద్దతుతో గెలుపొందిన పీవీ అన్వర్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటీవలే జరిగిన ఉపఎన్నికలో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. అతడికి పోటీగా కాంగ్రెస్‌, వామపక్ష కూటమి తమ అభ్యర్థులను పోటీకి దింపాయి. నేడు సాయంత్రంలోపు ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Also Read..

Mumbai Local Trains | 11 ఏండ్లలో 29 వేల మందిని బలి తీసుకున్న ముంబై లోకల్‌ రైళ్లు

Gas Leak | వంట చేస్తుండగా ఊడిన గ్యాస్‌ పైప్‌.. తర్వాత ఏం జరిగిందంటే?.. వీడియో

భారత్‌ గగనతలాన్ని అమెరికా వినియోగించ లేదు

​Bypoll Result | నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలు (Assembly Bypolls) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *