Cardamom | భోజనం చేశాక 2 యాలకులను నమిలి తినండి.. ఎన్నో లాభాలను పొందవచ్చు..

Follow

Cardamom | యాలకులను మనం ఎంతో పూర్వ కాలం నుంచే మన వంటి ఇంటి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. మసాలా వంటకాలు చేస్తే కచ్చితంగా యాలకులను వాడుతారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటల్లో అయితే యాలకులు కచ్చితంగా ఉండాల్సిందే. యాలకులను వేస్తే కూరలకు చక్కని రుచి, వాసన వస్తాయి. యాలకులను కేవలం మసాలా వంటకాలు మాత్రమే కాకుండా స్వీట్ల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. యాలకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలతోపాటు అనేక ఔషధ గుణాలు కూడా యాలకుల్లో ఉంటాయని, యాలకులను రోజూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. యాలకులను భోజనం చేసిన తరువాత నోట్లో వేసుకుని నమిలి మింగాలి. భోజనం చేశాక ఒక యాలక్కాయను నమిలి తింటే అనేక లాభాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలకు..
యాలకుల్లో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అంటే గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుందని అర్థం. యాలకులను తినడం వల్ల జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. యాలకులను తింటుంటే అజీర్తి, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, పొట్టలో అసౌకర్యం, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వీటి ద్వారా వచ్చే నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది. చాలా మంది భోజనం చేసిన తరువాత నోరు దుర్వాసనగా ఉంటుంది. అలాంటి వారు యాలకులను నములుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
గుండె ఆరోగ్యానికి..
యాలకుల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం బీపీని నియంత్రించడంలో యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో డై యురెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. రోజూ యాలకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాలకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు సైతం ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తింటుంటే శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
నోటి ఆరోగ్యానికి..
యాలకుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల యాలకులను నమిలి తింటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గిపోతుంది. దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా ఉంటాయి. యాలకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. యాలకులను తినడం వల్ల క్యాన్సర్ కణాలు నిర్మూలించడబతాయి. దీంతో పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. షుగర్ ఉన్నవారికి సైతం యాలకులు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే సమ్మేళనాల వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ సమస్య తగ్గుతుంది. ఇలా యాలకులను ఆహారం అనంతరం తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
యాలకులను మనం ఎంతో పూర్వ కాలం నుంచే మన వంటి ఇంటి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. మసాలా వంటకాలు చేస్తే కచ్చితంగా యాలకులను వాడుతారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటల్లో అయితే యాలకులు కచ్చితంగా ఉండాల్సిందే.