Carolyn Levitt | ఇండో-పసిఫిక్‌లో భారత్ వ్యూహాత్మక మిత్రదేశం : కరోలిన్ లెవిట్

Follow

Carolyn Levitt | ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలకమైన వ్యూహాత్మక మిత్రదేశమని అమెరికా పేర్కొంది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఇండో-పసిఫిక్‌లో చైనా పెరుగుతున్న పాత్రను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా భావిస్తున్నారని ప్రశ్నించగా.. భారత్ ఇండో-పసిఫిక్‌లో చాలా ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి, అధ్యక్షుడు ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇది భవిష్యత్‌లోనూ కొనసాగుతాయన్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికాతో భారత్ సంబంధాలు కొంత వరకు దెబ్బతిన్నాయన్న వార్తలు వచ్చాయి. భారత్-పాక్ వివాదంలో మూడో దేశం మధ్యవర్తిత్వం వహించలేదని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ పలుసార్లు కాల్పుల విరమణకు తానే ఒప్పించానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ట్రంప్ ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్‌ను వైట్ హౌస్‌లో భోజనానికి ఆహ్వానించారు.
ఇది ట్రంప్ పరిపాలన ఉద్దేశాలపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. కరోలిన్ లెవిట్‌ను భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిందా? త్వరలోనే జరుగుతుందా? అని ప్రశ్నించగా.. నిజమేనని చెప్పింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి తాము చాలా దగ్గరలో ఉన్నామని.. అధ్యక్షుడు ట్రంప్ గత వారం దీనిపై ప్రకటన చేశారన్నారు. నేను తమ వాణిజ్యశాఖ కార్యదర్శితో మాట్లాడానని చెప్పుకొచ్చారు. ప్రెసిడెంట్ ఓవర్ కార్యాలయంలోనే ఉన్నారని.. వారు ఒప్పందాన్ని ఖరారు చేస్తున్నారన్నారు.
భారత్ విషయానికి వస్తే అధ్యక్షుడు, వాణిజ్య బృందం నుంచి త్వరలోనే ప్రకటన వింటారన్నారు. గతవారం ట్రంప్ భారత్‌తో భారీగా ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. భారతదేశంతో ఒప్పందం దిశగా మనం ముందుకు సాగుతున్నామని ట్రంప్ అన్నారు. జులై 9వ తేదీకి ముందు రెండుదేశాలు ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏప్రిల్ 2న ప్రకటించిన సుంకాల రేట్లను అమెరికా జులై 9 వరకు నిలిపివేసింది.
అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులపై భారతదేశం పన్నులను తగ్గించాలని.. జన్యుపరంగా మార్పు చేయబడిన (GMO) పంటలకు అనుమతి ఇవ్వాలని అమెరికా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వ్యవసాయం, పాడిరంగంలో అమెరికాకు భారత్ రాయితీలు ఇవ్వడం కష్టమే. ఇప్పటి వరకు సంతకం చేసినా ఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లోనూ భారత్ పాడిరంగంలో అవకాశాలు ఇవ్వలేదు. కొన్ని పారిశ్రామిక వస్తువులు, మోటారు వాహనాలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పాల-వ్యవసాయ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పు చేయబడిన పంటలపై సుంకం రాయితీలను అమెరికా కోరుతోంది.
వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, దుస్తులు, ప్లాస్టిక్‌లు, రసాయనాలు, రొయ్యలు, నూనెగింజలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటి శ్రమతో కూడిన రంగాలలో అమెరికా నుంచి భారత్ సుంకం రాయితీలను డిమాండ్ చేస్తున్నది. భారతదేశ జాతీయ ప్రయోజనాలపై ఎలాంటి రాజీ ఉండదని.. అది దేశ, రైతుల ప్రయోజనాల కోసం అయితేనే ఏదైనా రాజీ పడుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
Carolyn Levitt | ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలకమైన వ్యూహాత్మక మిత్రదేశమని అమెరికా పేర్కొంది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.