Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఈరోజు మేం మా అప్‌డేట్స్ ట్యాబ్ కు సంబంధించిన కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాం. ఇది ఛానెల్స్ మరియు స్టేటస్ రెండింటికీ నిలయం. మీరు వాట్సాప్ లో ఏదైనా కొత్తదాన్ని కనుగొనడానికి నిలయంగా ఈ ట్యాబ్‌ను మార్చడానికి మేం గత రెండేళ్లుగా కృషి చేస్తున్నాం. దీనిని ఇప్పుడు రోజుకు 1.5 బిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మాకెంతో ప్రోత్సాహం లభించింది. వాట్సాప్ లో నిర్వాహకులు, సంస్థలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి సహాయం చేయాలనుకుంటున్నాం. మేందీన్నిమూడువిధాలుగాచేయబోతున్నాం: ●ఛానెల్ సబ్‌స్క్రిప్షన్‌లు: నెలవారీ రుసుముతో ప్రత్యేకమైన అప్‌డేట్‌లను స్వీకరించడానికి సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా మీకు ఇష్టమైన ఛానెల్‌కు మద్దతు ఇవ్వగలరు. ● ప్రమోట్ చేయబడిన ఛానెల్‌లు: మీరు డైరెక్టరీని చూస్తున్నప్పుడు మీకు ఆసక్తికరంగా అనిపించే కొత్త ఛానెల్‌లను కనుగొనడంలో మేం మీకు సహాయం చేస్తాం. మొదటిసారిగా, ఆయా నిర్వాహకులకు తమ ఛానెల్ దృశ్యమానతను పెంచుకోవడానికి ఒక మార్గం లభించినట్లయింది. ● స్టేటస్‌లో ప్రకటనలు: మీరు కొత్త వ్యాపారాన్ని కనుగొనగలరు మరియు వారు స్టేటస్‌లో ప్రచారం చేస్తున్న ఉత్పత్తి లేదా సేవ గురించి వారితో సులభంగా సంభాషణను ప్రారంభించగలరు. ఈ కొత్త ఫీచర్లు మీ వ్యక్తిగత చాట్‌లకు దూరంగా, అప్‌డేట్‌ల ట్యాబ్‌లో మాత్రమే కనిపిస్తాయి. దీని అర్థం మీరు స్నేహితులు, ప్రియమైనవారితో చాట్ చేయడానికి మాత్రమే వాట్సాప్ ఉపయోగిస్తే మీ అనుభవంలో ఎటువంటి మార్పు ఉండదు. గోప్యతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రకటనలు వాట్సాప్‌లో మేం చేసే ప్రతి పనిలాగే, ఈ ఫీచర్‌లను మేం సాధ్యమైనంత అత్యంత ప్రైవేట్ మార్గంలో నిర్మించాము. మీ వ్యక్తిగత సందేశాలు, కాల్స్, స్టేటస్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయి, అంటే ఎవరూ (మేము కూడా కాదు) వాటిని చూడలేరు లేదా వినలేరు. మీరు శ్రద్ధ వహించే స్టేటస్ లేదా ఛానెల్‌లలో ప్రకటనలను చూపించడానికి,…