CBSC Supplementary Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం
Follow

సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక ప్రకటన చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ద్వారా పరీక్షల షెడ్యూల్ తెలుసుకోవచ్చు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2025 జూలై 15 నుండి జులై 22 వరకు 10 వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఇక 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ 2025 జూలై 15న జరగనుంది.
ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలను మే 13న విడుదల చేసిన విషయం తెలిసిందే. 12వ తరగతిలో మొత్తం 17.04 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వారిలో 16.92 లక్షల మంది పరీక్షలు రాశారు. వారిలో 14.96 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. ఇక, పదో తరగతిలో 23.85 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 23.71 లక్షల మంది పరీక్షలు రాశారు. వారిలో 22.21 లక్షల మంది ఉత్తీర్ణత సాధించగా.. ఉత్తీర్ణత శాతం 93.66 శాతంగా నమోదైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
CBSC Supplementary Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక ప్రకటన చేసింది.