Chandragiri Car Incident: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రైవేట్ గన్‌మెన్ దుర్మరణం.. తిరుమలకు వెళ్లి వస్తూ..

Follow

Chandragiri Car Incident: తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు చనిపోయారు. వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి మండలం తూర్పుపల్లి జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కారులో ఇరుక్కున్న వారిని అతి కష్టం మీద బయటకు తీశారు స్థానికులు. కారు డివైడర్ ను ఢీకొన్న కాసేపటికి మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది.
తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో భార్యాభర్తలు ఉన్నారు. వారి కొడుకు, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు సిద్ధయ్యను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రైవేట్ గన్ మెన్ గా గుర్తించారు. ఇవాళ తన పుట్టినరోజు కావడంతో ఈ ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు సిద్ధయ్య. తిరిగి స్వగ్రామం గుడిపాలకు వెళ్తుండగా ఆయన కుటుంబం ప్రమాదం బారిన పడింది.
సిద్ధయ్య తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు గిరి, గాయత్రితో కలిసి కారులో తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు తూర్పుపల్లి వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పింది. డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా కారులో మంటలు ఎగసిపడ్డాయి. కారులో ఉన్న సిద్ధయ్య కుటుంబం మంటల్లో చిక్కుకుంది.
Also Read: అమెజాన్ కొత్త సర్వీస్.. ఇకపై ఇంటి వద్దే డయాగ్నస్టిక్ టెస్టులు.. ముందుగా ఈ 6 నగరాల్లో..
సిద్ధయ్య, ఆయన భార్య స్పాట్ లోనే మరణించారు. వారి పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఇవాళ సిద్ధయ్య పుట్టినరోజు. దీంతో కుటుంబంతో కలిసి ఆయన తిరుమలకు వెళ్లారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కుటుంబం మొత్తం కారులో తిరుగు ప్రయాణమైంది. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది.
ఇవాళ తన పుట్టినరోజు కావడంతో ఈ ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు సిద్ధయ్య.