Chapati: రాత్రి పూట అన్నానికి బదులు చపాతీలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే..

Follow

చపాతీలంటే ఇష్టంగా తినేవారు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారు రోజులో మూడు పూటల చపాతీలు పెట్టినా కూడా విసుగు లేకుండా తింటూ ఉంటారు. అయితే, కొందరు మాత్రం కేవలం రాత్రిపూట అన్నానికి బదులు చపాతీ తింటూ ఉంటారు. దాని వల్ల అధిక బరువు సమస్యను తప్పించుకోవచ్చని, లేదంటే, బరువు సులభంగా తగ్గుతామని నమ్ముతుంటారు. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు చాలా మంది అన్నానికి బదులు చపాతీలు తింటున్నారు. అయితే, రాత్రిపూట అన్నం మానేసి కేవలం చపాతీలు మాత్రమే తినటం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే…
రాత్రిపూట చపాతీ తినడం వల్ల కొన్ని పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చపాతీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. చపాతీలో కార్బో హైడ్రేట్స్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ, చపాతీలకు నూనె తక్కువ ఉండేలా చూసుకోండి. రాత్రి వేడివేడి చపాతీలు మాత్రమే తినాలి. అయితే, చపాతీలు ఎక్కువ సేపు నిల్వ ఉన్న మంచిదే.
మధుమేహం ఉన్నవారు లేదా డయాబెటిక్ వచ్చే ప్రమాదం ఉన్నవారు రాత్రిపూట చపాతీలు తినడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చపాతీలలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తగినంత ప్రోటీన్ లేదా ఫైబర్ లేకుండా తీసుకుంటే. అలాగే, చపాతీల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కానీ, రాత్రి ఆలస్యంగా చపాతీలు తినడం వల్ల పగటిపూట తీసుకునే ఆహారాల నుండి అవసరమైన విటమిన్లు . ఖనిజాలను గ్రహించే సామర్థ్యం దెబ్బతింటుంది. అయితే, అన్నం పూర్తిగా మానేయకూడదని వైద్యులు చెబుతున్నారు. అన్నం కొద్దిగా తినాలి. ఆ తర్వాత చపాతీలు కూడా తీసుకోవాలని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
అలాగే, చపాతీల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కానీ, రాత్రి ఆలస్యంగా చపాతీలు తినడం వల్ల పగటిపూట తీసుకునే ఆహారాల నుండి అవసరమైన విటమిన్లు . ఖనిజాలను గ్రహించే సామర్థ్యం దెబ్బతింటుంది. అయితే, అన్నం పూర్తిగా మానేయకూడదని వైద్యులు చెబుతున్నారు. అన్నం కొద్దిగా తినాలి. ఆ తర్వాత చపాతీలు కూడా తీసుకోవాలని చెబుతున్నారు.