Chiru-Pawan | పవన్ కళ్యాణ్ సినిమా సెట్‌లో ప్రత్యక్షమైన చిరు.. కాసేపు తమ్ముడితో…

Follow

Chiru-Pawan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న ఈ సినిమాలు ఎప్పుడో విడుదల కావాలి. కాని ఆయన రాజకీయ పనుల వలన డిలే అవుతూ వచ్చాయి. ఇప్పటికే హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్ పూర్తి చేయగా,ఈ మూవీని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్ నటిస్తున్న మరో చిత్రం ఓజీ షూటింగ్ కూడా పూర్తైందని తెలుస్తుంది. సుజీత్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్‌లో మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేశారు.
ఇక పవన్ ఖాతాలో ఉన్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నట్టు సమాచారం. పలు కీలక సన్నివేశాలను పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కిస్తున్నాడు హరీశ్ శంకర్. అయితే ఈ మూవీ సెట్‌కి మెగాస్టార్ చిరంజీవి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. సోమవారం రోజు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి చిత్రీకరణను దగ్గరుండి వీక్షించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో చిరు షూటింగ్ సీన్‌ను చూస్తుండగా, పవన్ కల్యాణ్ పక్కనే ఉండడం మనం చూడవచ్చు.
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా బ్రదర్స్ ఇద్దరు చాలా రోజుల తర్వాత కలిసి కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ చిత్రంలో రియల్ లైఫ్ సీన్‌ని హరీష్ ప్లాన్ చేసినట్టు సమాచారం. పవన్ కల్యాణ్ ఆ మధ్య ఓ సందర్భంలో కారు రూఫ్‌పై కూర్చొని ప్రయాణించడం మనం చూశాం. ఆయన కారు టాప్‌పై కూర్చొని వెళుతుండగా, కారుకు ఇరువైపులా సెక్యూరిటీ, వెనకాల బైకులపై అభిమానులు వెళ్లారు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఈ సీన్‌ని రీ క్రియేట్ చేసి సినిమాలో పెట్టనున్నాడట హరీష్ శంకర్. ఒకవేళ ఈ సీన్ సినిమాలో ఉంటే, థియేటర్లలో ఫుల్ విజిల్స్ పడడం పక్కా అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యువ నటి శ్రీలీల సందడి చేయనుంది. ఈ సినిమాకు దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Chiru-Pawan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న ఈ సినిమాలు ఎప్పుడో విడుదల కావాలి. కాని ఆయన రాజకీయ పనుల వలన డిలే అవుతూ వచ్చాయి. ఇప్పటికే హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్ పూర్తి చేయగా,ఈ మూవీని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.