Cleanliness | ఇంటి చుట్టూ నీరు నిల్వలేకుండా చూసుకోవాలి : పంచాయతీ కార్యదర్శి మాధవ్‌జాదవ్

Follow

Cleanliness | మద్దూరు (ధూళిమిట్ట), జూలై 01 : వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవ్‌జాదవ్ సూచించారు. మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టి పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాధవ్‌జాదవ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి చుట్టూ నీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడేందుకు గ్రామస్తులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌లు జ్యోతి, నిర్మల, ఐకేపీ సీఏలు సబిత, కావ్య, ఐకేపీ అధ్యక్షురాలు గొల్లపల్లి పరమేశ్వరి, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also :
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!
Cleanliness | వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రేబర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవ్‌జాదవ్. ఇంటి చుట్టూ నీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు.