Cm Chandrababu: విదేశాల్లో 15 మంది ఎమ్మెల్యేలు.. సీఎం చంద్రబాబు సీరియస్.. ఇక ఫారిన్‌లోనే ఉండటం మంచిదని చురకలు..

Follow

Cm Chandrababu: టీడీపీ విస్తృతస్థాయి భేటీలో నేతలకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. పలువురు ఎమ్మెల్యేలు, నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. ఈ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు, ఆహ్వానితుల్లో 56 మంది గైర్హాజరయ్యారు. దీంతో సీఎం చంద్రబాబు వారిపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.
సమావేశానికి గైర్హాజరై 15మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇక మీరంతా ఫారిన్ లోనే ఉండటం మంచిదన్నారు. నియోజవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉoడటo సరికాదని ముగింపు సందేశంలో గట్టిగా క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు. ఆహ్వానితుల్లో 56 మంది గైర్హాజరయ్యారంటూ అసహనం వ్యక్తం చేశారాయన. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకు ఎంత మంది ఉన్నారో అందరి లెక్కలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని గట్టిగా చెప్పారు చంద్రబాబు.
Also Read: ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు.. మళ్లీ ఆమెకే పగ్గాలు ఇస్తారా? కొత్త వాళ్లు రాబోతున్నారా?
”నేతల గైర్హాజరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చురకలు అంటించారు. గైర్హాజరకు కారణాలు అడిగితే కొంత మంది విదేశీ పర్యటనలు అన్నారు, కొంతమంది దైవ దర్శనాలు అని సమాధానం ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలకంటే ఇతరత్రా ఎక్కువయ్యాయా? దేవాలయ సందర్శనాలు మరో రోజు కూడా పెట్టుకోవచ్చు కదా? తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునే వారు ఇక ఫారిన్ లో ఉండటం మంచిది. తానా లు, ఆటా లకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారి జాబితా కూడా నా వద్ద ఉంది” అని చంద్రబాబు అన్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6.30 గంటల వరకూ కొనసాగింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీలో మేనిఫెస్టో అంశాలపై సుదీర్ఘ చర్చించారు చంద్రబాబు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం చురకలు అంటించారు. అమలు చేసిన హామీలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై సీఎం దిశా నిర్దేశం చేశారు. నాన్ సీరియస్ గా ఉన్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు నాకే సలహాలు ఇస్తున్నారంటూ చంద్రబాబు ఛలోక్తులు విసిరారు.
పని చేయకుండా సలహాలకే పరిమితమయ్యే ఎమ్మెల్యేలకు భవిష్యత్ నాయకులుగా ఉండలేరని తేల్చి చెప్పారు. సమావేశానికే రాని వారు.. మీ నియోజకవర్గాల్లో ఏం పవి చేస్తారు అని చంద్రబాబు ప్రశ్నించారు. అధినేత. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కారణంగా ప్రభుత్వ సమీక్షల నుంచి మంత్రులకు వెసులుబాటు కల్పించారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటికి ప్రచారం చేయాలంటూ చంద్రబాబు ఆదేశించారు.
కొందరు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు నాకే సలహాలు ఇస్తున్నారంటూ చంద్రబాబు ఛలోక్తులు విసిరారు.