Congress: ఈ నెల 24న గాంధీ భవన్లో కాంగ్రెస్ నూతన కమిటీల సమావేశం..

Follow

Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24వ తేదీన ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ) కమిటీ సమావేశం కానుంది. అనంతరం పీసీసీ సలహా కమిటీ (పీసీసీ అడ్వజరీ కమిటీ పీఏసీ) సమావేశాలు జరగనున్నాయి. ఇక, మధ్యాహ్నం తర్వాత నూతనంగా నియామకం అయిన టీపీసీసీ ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొంటారు.
Read Also: Konda Surekha: ఆయన నల్లికుట్ల మనిషి.. నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు..
అయితే, తెలంగాణలో మొత్తం 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను ఏఐసీసీ వెల్లడించింది. పీసీసీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను మాత్రం ఇంకా ప్రకటించలేదు. పదవుల భర్తీలో విధేయత, సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేస్తున్న వారి వివరాలను జిల్లాల వారీగా సేకరించి ఈ పదవులకు ఏఐసీసీ ఎంపిక చేసింది.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24వ తేదీన ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ) కమిటీ సమావేశం కానుంది. అనంతరం పీసీసీ సలహా కమిటీ (పీసీసీ అడ్వజరీ కమిటీ పీఏసీ) సమావేశాలు జరగనున్నాయి.