Cristiano Ronaldo: మనిషి కాదు.. మనీ మిషన్.. రోనాల్డో ఏడాదికి ఎంత సంపాధిస్తాడో తెలుసా?

Follow
సౌదీ అరేబియా క్లబ్ అల్ నాసర్తో క్రిస్టియానో రొనాల్డో ఒప్పందాన్ని రాబోయే రెండేళ్ల పాటు పొడిగించారు.అల్ నాసర్తో రోనాల్డో చేసుకున్న ఈ ఒప్పందం 2027 వరకు కొనసాగనుంది. ఇందులో పెద్ద విషయం ఏమిటంటే, రాబోయే రెండేళ్లలో రొనాల్డో ఊహించలేని విధంగా చాలా డబ్బు పొందబోతున్నాడు. రొనాల్డోకు ఎంత జీతం వస్తుంది, అతనికి ఎంత బోనస్ వస్తుందనేది తెలుసుకుందా..
క్రిస్టియానో రొనాల్డో వార్షిక జీతం దాదాపు 2000 కోట్లు (178 మిలియన్ పౌండ్లు). దీనితో పాటు, అతని సంతకం బోనస్ మొదటి సంవత్సరంలో రూ. 264.6 కోట్లు (24.5 మిలియన్ పౌండ్లు), రెండవ సంవత్సరంలో రూ. 410.4 కోట్లు (38 మిలియన్ పౌండ్లు) ఉంటుంది.
సౌదీ ప్రో లీగ్ గెలిచినందుకు రొనాల్డోకు 8 మిలియన్ పౌండ్ల బోనస్ లభిస్తుంది. అంటే రూ. 86.4 కోట్లు రొనాల్డొకు లభిస్తాయి. దీనితో పాటు, ఆసియా ఛాంపియన్స్ లీగ్ గెలిచినందుకు బోనస్‌గా 6.5 మిలియన్ పౌండ్లు అంటే రూ. 70.2 కోట్లు రోనాల్డొకు చేరనున్నాయి.
రొనాల్డో గోల్డెన్ బూట్ గెలిస్తే, అతనికి 4 మిలియన్ పౌండ్లు అంటే 43.2 కోట్ల రూపాయలు లభిస్తాయి. ఇది మాత్రమే కాదు, అతను మొదటి సంవత్సరంలో చేసే ప్రతి గోల్‌కు 86.4 లక్షల రూపాయలు, రెండవ సంవత్సరంలో 1 కోటి రూపాయలకు పైగా అందుకుంటాడు. ఒక గోల్‌కు సహాయం చేస్తే, అతను మొదటి సంవత్సరంలో 43.2 లక్షల రూపాయలు, రెండవ సంవత్సరంలో 50 లక్షల రూపాయలకు పైగా అందుకుంటాడు.
అల్ నాసర్లో రొనాల్డోకు 15 శాతం వాటా లభిస్తుంది. ఈ వాటా అంచనాల ప్రకారం, దాని మొత్తం రూ. 356.4 కోట్లు. ఇది మాత్రమే కాదు, అతని స్పాన్సర్షిప్ ఒప్పందం రూ. 648 కోట్లు అవుతుంది. దీనితో పాటు, ప్రైవేట్ జెట్ కోసం ఖర్చు చేసినందుకు అతనికి రూ. 43.2 కోట్లు కూడా లభిస్తాయి.
ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో.. ఇతను ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇతను ఒక పోస్ట్ చేస్తే అది నిమిషాల్లో మిలియన్స్ వీవ్స్తో దూసుకుపోతుంది. అయితే రొనాల్డ్లో యాడ్స్, ప్రమోషన్స్ ద్వారా ఎంత డబ్బులు సంపాధిస్తాడో మీకు తెలుసా.. క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ఇది అతన్ని ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఫుట్‌బాలర్‌గా నిలబెట్టనుంది. ఆదేంటో తెలుసుకుందాం పందండి..