Daggubati Purandeswari: స్వలాభాపేక్ష ఏ రోజూ చూసుకోలేదు.. నాకు మరో ఆలోచన లేదు!

Follow

రాజకీయాల్లో స్వలాభాపేక్ష ఏ రోజూ తాను చూసుకోలేదని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. తన రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదన్నారు. తనను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని తాను ఆశిస్తున్నానని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. బీజేపీ జెండాను మాధవ్‌కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను పురంధేశ్వరి అప్పగించారు. మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పురందేశ్వరి మాట్లాడారు.
‘2013లో బీజేపీలోకి నేను వచ్చాను. బీజేపీలోకి వచ్చిన నాటి నుంచి నాకు పార్టీ గౌరవం ఇస్తోంది. అన్ని విధాలుగా నాకు గౌరవం ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు. పీవీఎన్ మాధవ్ తండ్రి చలపతిరావు పోరాట యోధులు. చలపతిరావు గారి నుంచి పట్టుదల, ఎలా ముందుకు వెళ్లాలో నేర్చుకున్నాను. వెంకయ్య నాయుడు నుంచి చనువు, చొరవ నేర్చుకున్నాను. ఏపీ బీజేపీకి జీవితం అంకితం చేసిన నాయకుల నుంచి నేను చాలా నేర్చుకున్నా. నన్ను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలు ఇరువురికి నా ధన్యవాదాలు’ అని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చెప్పారు.
Also Read: Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?
‘కార్యకర్త సహకారం లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవడం సాధ్యం కాదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా రెండేళ్లల్లో పార్టీ బలోపేతం కోసం నా వంతు కృషి చేశా. నాకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించా. స్వలాభాపేక్ష ఏ రోజూ నేను చూసుకోలేదు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. నా రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఒకొక్క మాట ఆచితూచి మాట్లాడాలి’ అని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సూచించారు. గత రెండేళ్లుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి పని చేసిన విషయం తెలిసిందే.
రాజకీయాల్లో స్వలాభాపేక్ష ఏ రోజూ తాను చూసుకోలేదని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. తన రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదన్నారు. తనను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని తాను ఆశిస్తున్నానని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. బీజేపీ జెండాను మాధవ్‌కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను పురంధేశ్వరి అప్పగించారు. మాధవ్