Daren Sammy | ఐసీసీ కోడ్ ఉల్లంఘన.. వెస్టిండీస్ హెడ్‌కోచ్ మ్యాచ్ ఫీజులో కోత

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Sammy

Daren Sammy : వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సమీ(Daren Sammy)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఐసీసీ నియమావళిని అతిక్రమిస్తూ టీవీ అంపైర్ నిర్ణయాన్ని బహిరంగా తప్పుపట్టినందుకు అతడికి మ్యాచ్ ఫీజులో కోత విధించింది. అంతేకాదు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. మ్యాచ్ అనంతరం సమీపై రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. దాంతో, విచారణ సమయంలో విండీస్ కోచ్ తన పొరపాటును అంగీకరించాడు. మ్యాచ్ అధికారిని బాహాటంగా విమర్శించినందుకు.. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది ఐసీసీ.

‘మీ పని మీరు సక్రమంగా చేయండి అన్నందుకు నన్ను దోషిగా గుర్తించారు. టీవీ అంపైర్‌ అడ్రియన్ హోల్డ్‌స్టాక్‌తో నాకు తరచూ వాగ్వాదం జరుగుతోంది. ఇంగ్లండ్ సిరీస్ నుంచి అతడితో నేను విభేదిస్తున్నా. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కూడా కచ్చితత్వంతో కూడిన నిర్ణయాలు వెలువరించాలని అంపైర్‌ను కోరానంతే. కానీ అదే తప్పని అంటున్నారు’ అని సమీ మీడియా సమావేశంలో వెల్లడించాడు.

Sammy 1

బార్బడోస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలిటెస్టులో ఐదుగురు విండీస్ బ్యాటర్లు వివాదాస్పదంగా ఔటయ్యారు. దాంతో, హెడ్‌కోచ్ సమీ టీవీ అంపైర్‌పై కోపం పట్టలేకపోయాడు. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ సైతం తమపై పగబట్టినట్టుగా తప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తున్నారని విమర్శలు గుప్పించాడు. అలెక్స్ క్యారీ అందుకున్న బంతి నేలకు తాకినా సరే ఔటిచ్చాడు థర్డ్ అంపైర్ హోల్డ్‌స్టాక్. అంతేకాదు బంతి బ్యాట్‌కు తాకినట్టు స్పష్టంగా అల్ట్రా ఎడ్జ్‌తో తేలినప్పటికీ ఎల్బీగా ఔట్ ఇవ్వడంతో విండీస్ ఆటగాళ్లు ఇదెక్కడి అన్యాయం అని షాకయ్యారు.

తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటయ్యింది. అనంతరం ఆతిథ్య జట్టును 190కే కట్టడి చేసిన ఆసీస్.. బ్యూ వెబ్‌స్టర్(63), అలెక్స్ క్యారీ(63)లు రాణించడంతో 310 రన్స్ కొట్టింది. అనంతరం ఛేదనలో వెస్టిండీస్‌ను జోష్ హేజిల్‌వుడ్ దెబ్బకొట్టాడు. ఐదు కీలక వికెట్లు తీసి ఆసీస్‌కు 159 పరుగుల విజయాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

​Daren Sammy : వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సమీ(Daren Sammy)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. టీవీ అంపైర్ నిర్ణయాన్ని బహిరంగా తప్పుపట్టినందుకు మ్యాచ్ ఫీజులో కోత విధించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *