Deen Dayal Nagar | ఆలయం గేటు పేరుతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల స్థలంపై కన్ను

Follow

Deen Dayal Nagar | బంజారాహిల్స్, జూన్ 22 : జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని దీన్ దయాళ్‌నగర్‌లో గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నేతలు ఆక్రమించేందుకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. వినాయక్‌నగర్ పర్వతాంజనేయ స్వామి ఆలయానికి గేటు ఏర్పాటు చేస్తున్నామన్న నెపంతో ఖరీదైన స్థలంపై కన్నేశారు.
దీన్‌దయాళ్‌నగర్ బస్తీ, వినాయక్‌నగర్ బస్తీ మధ్యన సుమారు 2 ఎకరాల స్థలాన్ని గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం కేటాయించింది. అయితే ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో స్థలం ఖాళీగా ఉంది. కాగా ఈ స్థలం పక్కనుంచి పర్వతాంజనేయస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు ఉంది. రోడ్డుపక్కన సుమారు 10 ఇండ్లు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ఆలయం పేరుతో స్థలాన్ని ఆక్రమించేందుకు బస్తీకి చెందిన కొంతమంది అధికారపార్టీ నేతలు సరికొత్త స్కెచ్‌కు తెరతీశారు. ఆదివారం నాడు ఆలయానికి వెళ్లేరోడ్డుపై సుమారు 150 మీటర్ల దూరంలోనే గేటు ఏర్పాటు చేశారు. గేటులోపల ఉండే ఇండ్లకు దారిలేకుండా చేయడంతో పాటు గేటు లోపల స్థలాన్ని ప్లాట్లుగా వేసి అమ్ముకోవాలన్న కుట్రలకు తెరలేపారని, గుడి గేటు పేరుతో జనం మధ్యన గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జూబ్లీహిల్స్ డివిజన్ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షేక్‌పేట రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమంగా ఏర్పాటు చేసిన గేటును తొలగించాలని డిమాండ్ చేశారు.
Deen Dayal Nagar | జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని దీన్ దయాళ్‌నగర్‌లో గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నేతలు ఆక్రమించేందుకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు.