Delhi: ఆ వాహనాలకు ఇక నో పెట్రోల్, నో డిజీల్.. ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Delhi: ఆ వాహనాలకు ఇక నో పెట్రోల్, నో డిజీల్.. ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ముందంజలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో వాహన కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఢిల్లీలో ఇక కాలం చెల్లిన పాత కార్లు, వాహనాలకు పెట్రోల్ బంక్‌లలో ఇంధనం పోయడాపకపి నిలిపివేసింది. ఢిల్లీ వాయు కాలుష్యంలో వాహన కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో ఢిల్లీ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు , 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయడం నిలిపివేశారు నిర్వాహకులు. ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 60లక్షల వరకు కాలం చెల్లిన వాహనాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటి కారణంగా కాలుష్యం పెరుగుతుండడంతో దానిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇంధన నిషేధ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇంధన నిషేధాన్ని అమలు చేయడానికి, రవాణా శాఖ డేటాబేస్‌కు అనుసంధానించబడిన AI-ఆధారిత కెమెరాలను పెట్రోల్ బంక్‌లలో ఏర్పాటు చేసింది. ఈ AI కెమెరాలు నంబర్ ప్లేట్ల ఆధారంగా వాహనం ఏ సంవత్సరంలో రిజిస్టర్ చేయబడింది. దాని కాలం ముగిసిందా లేదా అనేది నిర్ధారించుకుని.. ఒక వేల వాహన కాలపరిమితి ముగిసినట్టయితే పెట్రోల్ బంకులో ఏర్పాటు చేసిన స్పీకర్‌ ద్వారా అలారం అలర్ట్‌ ఇస్తుంది. ఇలా పాత వాహనాలను గుర్తించి వాటికి పెట్రోల్ డీజిల్‌ని నింపడం నిలిపివేస్తారు బంక్‌ సిబ్బంది. వాహనం గడువు ముగిసిందని ప్రకటన రాగానే వాహన యజమానిపై చర్యలు తీసుకునేలా రవాణా శాఖకు సమాచారం అందుతుంది. గడువు ముగిసిన వాహనానికి ఇంధనం ఇస్తే పంప్ ఆపరేటర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. కాగా మొదటి సారి కాలం చెల్లిన కారు పట్టుబడితే 10 వేలు జరిమానా..బైక్ పట్టుబడితే 5 వేలు జరిమానా చెల్లించి వాహనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెండోసారి పట్టుబడితే వాహనాన్ని స్క్రాప్‌కి తరలిస్తారు.

ఢిల్లీలోని మొత్తం 350 పెట్రోల్, డీజిల్ పంపులున్నాయి. వీటిని ప్రభుత్వం నాలుగు భాగాలుగా విభజించింది. 1 నుండి 100 నంబర్ పంపుల వద్ద పోలీసులను ఏర్పాటు చేసింది. 101 నుండి 159 నంబర్ పంపుల వద్ద రవాణా బృందాలు, 160 నుండి 250 నంబర్ పంపుల వద్ద ఢిల్లీ పోలీసులు రవాణా శాఖ సంయుక్త బృందాలు, 251 నుండి 350 నంబర్ పంపుల వద్ద మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు పోలీసు సిబ్బందిని ప్రభుత్వం విధుల్లో ఉంచింది. ఇంధనం నింపడానికి నిరాకరించడం , వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి ఏవైనా అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కోవడం కోసం పెట్రోల్ బంకుల వద్ద పోలీసులు,రవాణా అధికారుల బృందాలు విధులు నిర్వర్తిస్తాయి.

ఇంధన నిషేధం అమలుతో పెట్రోల్ పంప్ నిర్వాహకుల ఇబ్బందులు..

ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంధన నిషేధం గురించి ప్రభుత్వం ట్రయల్ రన్ నిర్వహించలేదని, కాబట్టి ఇది అమలు చేస్తున్నపుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఢిల్లీ పెట్రోల్ డీలర్ల సంఘం ఆరోపించింది. పూర్తిగా పెట్రోల్ పంప్‌ను కవర్ చేయాలంటే అధిక సంఖ్యలో AI కెమెరాలు అవసరం ఉంటుందని.. కావలసిని కెమెరాలు ఏర్పాటు జరగలేదని పంప్‌ నిర్వహాకులు అంటున్నారు. కొన్ని కెమెరాలు పెట్రోల్ పోసిన తరువాత నెంబర్ ప్లేట్ రీడ్ చేసేలా ఇన్స్టాల్ చేశారని.. కెమెరా నంబర్ ప్లేట్‌ను సరిగ్గా చదవలేకపోతే, డేటాబేస్ నవీకరించబడకపోతే వ్యవస్థ విఫలమైతే, వివాదాలు తలెత్తవచ్చన్న ఢిల్లీ పెట్రోల్ డీలర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇందులో నిషేధ కార్యక్రమం అమలులో 24 గంటలపాటు పోలీసులు అధికారులు పెట్రోల్ పంపుల వద్ద లేకపోతే వాహనదారులు గొడవ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు ఢిల్లీలో ఇంధనం నిరాకరించబడిన వాహనం ఎన్సీఆర్ పరిధిలో నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ ఢిల్లీకి ఆనుకుని ఉన్న రాష్ట్రాలలోని పెట్రోల్ పంపులలో ఇంధనం నింపుకునే అవకాశం ఉంది. దీంతో పాటు అక్టోబర్, నవంబర్ చలికాలం ప్రారంభం అయ్యే రోజుల్లో ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటుంది. ఆ సమయంలో పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలు దహనంతో పాటు ఢిల్లీలోకి వచ్చే డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఢిల్లీలో అంతర్గతంగా అమలవుతున్న ఇంధన నిషేధం వల్ల వాహన కాలుష్య తీవ్రత తగ్గిందా లేదా అనేది తెలియాలన్నా రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

​ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ముందంజలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో వాహన కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఢిల్లీలో ఇక కాలం చెల్లిన పాత కార్లు, వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధనం నింపడం నిలిపివేసింది. ఢిల్లీ వాయు కాలుష్యంలో వాహన కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో కాలం చెల్లిన వాహనాలకు ఇంధన రీఫిల్స్‌ను నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *