DGCA | ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం.. సమగ్ర ఆడిట్‌ కోసం సరికొత్త విధానం తేబోతున్న డీజీసీఏ..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Air India

DGCA | ఇటీవల జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమానయానరంగంలో కీలకమైన మార్పులు చేసేందుకు డీజీసీఏ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం సమగ్రమైన ప్రత్యేక ఆడిట్‌ కోసం సరికొత్త వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. దాంతో వ్యవస్థాగత బలహీనతలను చురుగ్గా గుర్తించడం సాధ్యం కానున్నది. ఈ ఆడిట్స్‌ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రమాణాలు సరిగ్గా పాటిస్తున్నాయా? లేదా? తేలనున్నది. అలాగే, భారతదేశ జాతీయ విమానయాన నిబంధనలు సైతం ఖచ్చితంగా పాటించే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఎయిర్ ఇండియా డివిజనల్ వైస్ ప్రెసిడెంట్‌తో సహా తన ముగ్గురు అధికారులను సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టరింగ్‌కు సంబంధించిన అన్ని రోల్స్‌ నుంచి, బాధ్యతల నుంచి తొలగించాలని డీజీసీఏ ఆదేశించిన విసయం తెలిసిందే. లైసెన్సింగ్, సౌకర్యం, ఆవిష్కరణ అవసరాల్లో లోపాలు ఉన్నప్పటికీ విమాన సిబ్బంది షెడ్యూలింగ్, ఆపరేషన్‌లో ఎయిర్ ఇండియా పదేపదే నిర్లక్ష్యం వహించిందని డీజీసీఏ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏఆర్‌ఎంఎస్‌ నుంచి సీఏఈ విమాన-సిబ్బంది నిర్వహణ వ్యవస్థకు మారిన తర్వాత సమీక్ష సమయంలో ఈ నిర్లక్ష్యం గుర్తించారు. ఎయిర్ రూట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ARMS ) అనేది వివిధ కార్యాచరణ, నిర్వహణ విధుల కోసం ఎయిర్‌లైన్ ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్. ఇందులో సిబ్బంది జాబితా-విమాన ప్రణాళిక మొదలైనవి ఉంటాయి. ఈ నెల 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయిన రెండు నిమిషాలకే కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా విమానం AI-171 అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన వెంటనే హాస్టల్ భవనంపై కూలిపోయింది. దాంతో హాస్టల్‌లో ఉన్న మరో 29 మంది మరణించారు. విమాన ప్రమాదం ఘటనలో మొత్తంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం తర్వాత డీఎన్‌ఏ సరిపోలిన నేపథ్యంలో 215 మందిని గుర్తించగా.. 198 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.

​DGCA | ఇటీవల జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమానయానరంగంలో కీలకమైన మార్పులు చేసేందుకు డీజీసీఏ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం సమగ్రమైన ప్రత్యేక ఆడిట్‌ కోసం సరికొత్త వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *