Diabetic: షుగర్ పేషంట్స్ రాత్రిపూట అన్నం తినొచ్చా.. తింటే ఏమవుతుంది? నిపుణులు ఏమంటున్నారు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Can diabetic patients eat rice?

డయాబెటిస్ అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువ ఉండటం. ఇది టైప్ 1, టైప్ 2 అనే రెండు రకాలుగా ఉంటుంది. షుగర్ కంట్రోల్ చేయడంలో ఆహార నియంత్రణ అత్యంత కీలకం. అందులోనూ రాత్రిపూట తినే ఆహారం షుగర్ నియంత్రణపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అయితే షుగర్ సమస్య ఉన్న దాదాపు అందరు రాత్రిపూట అన్నం(వైట్ రైస్) తినడం మానేస్తారు. కానీ, చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే షుగర్ పేషంట్స్ అన్నాన్ని పూర్తిగా మానేయాలా? మరీ ముఖ్యంగా రాత్రి మానేయాలా? అని. మరి ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తినవచ్చా.. లేదా?

సూటిగా చెప్పాలంటే డయాబెటిక్ పేషెంట్ రాత్రిపూట అన్నం తినవచ్చు. కానీ, కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నంలో ఉండే కార్బొహైడ్రేట్‌లు గ్లూకోజ్‌గా మారి రక్తంలో త్వరగా కలిసిపోతాయి. దీనివల్లే షుగర్ లెవల్స్ పెరగడం జరుగుతుంది. కాబట్టి, కొన్ని నియమాలు తప్పనిసరి.

అన్నాన్ని పూర్తిగా మానేస్తే ఏమవుతుంది?

  • శరీరానికి సరిపడా శక్తి అందదు.
  • రాత్రిపూట బీపీ తగ్గే ప్రమాదం ఉంది.
  • కొంతమందిలో నిద్రలో హైపోగ్లైసీమియా వచ్చే ప్రమాదం ఉంది.
  • అందుకే రాత్రిపూత చాలా తక్కువ మోతాదులో అన్నం తినడం ఉత్తమం.

రాత్రి అన్నం ఎక్కువగా తింటే ఏమవుతుంది?

1.బ్లడ్ షుగర్ పెరగడం: షుగర్ పేషేంట్స్ రాత్రిపూట అన్నం తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయి త్వరగా పెరుగుతుంది. రాత్రిపూట శారీరకశ్రమ ఉండదు కాబట్టి శరీరం షుగర్‌ను ఎఫెక్టివ్‌గా ఉపయోగించలేకపోతుంది.

2.నిద్రలేమి, మలబద్ధకం: అధిక అన్నం తినటం వల్ల జీర్ణమయ్యేంత వరకు నిద్ర రాకపోవచ్చు. జీర్ణప్రక్రియ ఆలస్య కావడం వల్ల మలబద్ధకం ఏర్పడవచ్చు.

రాత్రిపూట అన్నం తినేటప్పుడు పాటించాల్సిన నియమాలు:

1.మితమైన పరిమాణం: సుమారు 1 గిన్నె (150–200 గ్రాములు cooked) అన్నం మాత్రమే తీసుకోవాలి. దాంతోపాటు కూరగాయలు, పప్పులు, ఆమ్లెట్/దాల్చిన పప్పు ఉండేలా చూసుకోవాలి.

2.అన్నానికి బదులుగా మిలెట్స్: జొన్న అన్నం, సజ్జ అన్నం, రాగి దోస, బ్రౌన్ రైస్ మొదలైనవి తినడం మంచిది. వీటితో రక్తంలో షుగర్‌ లెవెల్ స్థిరంగా ఉంటుంది

3.సమయ పాలన: సమయానికి భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు నడవడం మంచిది. ఫైబర్ అధికంగా ఉన్న ఫుడ్‌ షుగర్ పెరగకుండా అడ్డుకుంటుంది

డాక్టర్లు ఏమంటున్నారు?

  • రాత్రి అన్నం తినవచ్చు, కానీ నియంత్రిత పరిమాణంలో.
  • కార్బోహైడ్రేట్లను ఫైబర్, ప్రొటీన్లతో బ్యాలెన్స్ చేయాలి.

 

​Diabetic: డయాబెటిక్ పేషెంట్ రాత్రిపూట అన్నం తినవచ్చు. కానీ, కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *