Dil Raju | ‘గేమ్ ఛేంజర్’ నా కెరీర్‌లోనే పెద్ద గుణపాఠం : దిల్ రాజు

Follow

Dil Raju | అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం తమ్ముడు. నితిన్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. సీనియర్ నటి లయ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం జూలై 04న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు నిర్మాత దిల్ రాజు. అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన నిర్మాణంలో వచ్చి డిజాస్టార్ అందుకున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘గేమ్ ఛేంజర్’ తన కెరీర్‌లో ఒక “తప్పుడు నిర్ణయం” అని దిల్ రాజు అంగీకరించారు. శంకర్ లాంటి పెద్ద దర్శకులతో పనిచేయడం ఇదే తన మొదటి అనుభవం అని.. ఇది తనకు ఒక పెద్ద గుణపాఠం అని ఆయన పేర్కొన్నారు. పెద్ద సినిమాలు, పెద్ద దర్శకులతో చేసినప్పుడు 100 శాతం సమస్యలు వస్తాయి. ఇది దిల్ రాజుకే కాదు, అందరికీ ఎదురయ్యే సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు.
దర్శకుడు శంకర్ విషయంలో తన ప్రమేయం లేకుండానే చాలా పనులు జరిగిపోయాయని, సినిమా మేకింగ్ తన నియంత్రణలో లేదని పరోక్షంగా సూచించారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా తొలి కట్ నాలుగున్నర గంటలకు పైగా వచ్చిందని, ఎడిటర్ కూడా ఈ విషయాన్ని చెప్పారని దిల్ రాజు అంగీకరించారు. పెద్ద డైరెక్టర్లతో పని చేస్తున్నప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేమని, కానీ తప్పు జరిగినప్పుడు నిర్మాతగా దాన్ని ఆపాల్సిన బాధ్యత తనదేనని, ఆ విషయంలో తాను విఫలమయ్యానని ఒప్పుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ వంటి భారీ ప్రాజెక్టుకు అసలు గ్రీన్ లైట్ ఇచ్చి ఉండకూడదని, ఇది తన పొరపాటేనని దిల్ రాజు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సినిమాను చివరి నిమిషం వరకు తాను చూడలేదన్న వార్తలను ఖండిస్తూ, తాను ముందే సినిమా చూశానని స్పష్టం చేశారు. మొత్తం మీద, ‘గేమ్ ఛేంజర్’ పరాజయం పట్ల దిల్ రాజు నిరాశను వ్యక్తం చేస్తూ, కొన్ని విషయాలలో తన నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితికి దారితీసిందని పేర్కొన్నారు. పెద్ద దర్శకులతో సినిమా తీసేటప్పుడు ముందే స్పష్టమైన నిబంధనలతో కాంట్రాక్ట్ చేసుకోవాలని, తాను అలా చేయకపోవడం ఒక పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు.
Read More
Benjamin Netanyahu: ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యహూ
actor sri ram | డ్రగ్స్ కేసు.. నటుడు శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Dilip Doshi: మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి కన్నుమూత
Dil Raju | అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం తమ్ముడు. నితిన్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. సీనియర్ నటి లయ కీలక పాత్రలో నటిస్తుంది.