Dil Raju: సినిమా గురించి ఎక్కువ మాట్లాడొద్దని మాట తీసుకున్నాడు!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Thammudu Movie Trailer Launch Event Hyderabad

నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితిన్ ‘జయం’ సినిమాతో హీరోగా మారి 23 ఏళ్లయిందని, తాను ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి 22 ఏళ్లయిందని, ‘ఆర్య’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన వేణు శ్రీరామ్‌కు 21 ఏళ్లు పూర్తయినట్లు చెప్పుకొచ్చారు. నితిన్ ‘జయం’ సినిమాతో తనకంటే ఏడాది సీనియర్ అని ఆయన పేర్కొన్నారు.

Also Read:Kubera : ’మాది మాది సోకమంతా’ వీడియో సాంగ్ రిలీజ్

తమ్ముడు సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా శ్రీరామ్ వేణు అనుకున్న కథని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి వీళ్లందరినీ బెండు తీశారంటూ, సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్ మొత్తాన్ని స్టేజ్ మీదకు ఆహ్వానించారు. ఒక్కొక్క టెక్నీషియన్ ఎంత కష్టపడితే అవుట్‌పుట్ ఇంత బాగా వచ్చిందో తనకు తెలుసని, పేరుపేరునా ఒక్కొక్క టెక్నీషియన్‌ను ఆయన అభినందించారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడికే దక్కుతుందని, ఎందుకంటే 21 ఏళ్ల జర్నీలో వేణు శ్రీరామ్ అంటే ఏంటో తమకు తెలుసని చెప్పుకొచ్చారు.

అనంతరం, సినిమాలో నటించిన నటీమణులను స్టేజ్ మీదకు తీసుకొచ్చి, నితిన్‌తో పాటు ఈ ఐదుగురు కూడా హీరోలే అని చెప్పొచ్చని దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితిన్ సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు వస్తూ ఉంటాయని, అవి తాము చూశామని, నితిన్ చివరి 4-5 సినిమాలు సరిగా ఆడలేదని బాధలో ఉన్నాడని, కానీ ఈ సినిమా అతనికి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని దిల్ రాజు అన్నారు. అందరం ఫెయిల్ అవుతాం, సక్సెస్ అవుతామని, ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ విలువ తెలియదని చెప్పారు. ఈ సినిమాతో నితిన్‌కు మళ్లీ ఒక మంచి సక్సెస్ రాబోతోందని అన్నారు.

Also Read:Coolie : ఆ నలుగురిలో ముగ్గురు కలిసి కూలీని దించుతున్నారు!

ఈ సినిమా గురించి వేణు శ్రీరామ్ ఎక్కువ మాట్లాడొద్దని మాట తీసుకున్నాడని, అయినా సరే టెక్నీషియన్స్, నటీనటుల గురించి చెప్పానని, వారందరూ అలా చేయగలిగారంటే దానికి కారణం వేణు శ్రీరామ్ అని, సినిమా రిలీజ్ అయిన రోజు మళ్లీ మాట్లాడుకుందామని దిల్ రాజు అన్నారు.

​నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితిన్ ‘జయం’ సినిమాతో హీరోగా మారి 23 ఏళ్లయిందని, తాను ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి 22 ఏళ్లయిందని, ‘ఆర్య’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన వేణు శ్రీరామ్‌కు 21 ఏళ్లు పూర్తయినట్లు చెప్పుకొచ్చారు. నితిన్ ‘జయం’ సినిమాతో తనకంటే ఏడాది సీనియర్ అని ఆయన పేర్కొన్నారు. Also Read:Kubera : ’మాది 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *