Diwali Release Fight : దీపావళికి టాలీవుడ్… కోలీవుడ్ మధ్య భారీ ఫైట్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Diwali Clash Tollywood Vs Kollywood Battle For Box Office Supremacy

నార్త్‌పై టాలీవుడ్ క్లియర్ డామినేషన్ చూపించి.. సౌత్ సినిమాల పవర్ చూపిస్తుంటే.. తమిళ తంబీలు తెలుగు చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేస్తున్నారు. సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ కొట్టుకుని బీటౌన్‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఒరవడి ఈ మధ్య మరీ ఎక్కువైంది. తమిళ తంబీలు.. టాలీవుడ్ మార్కెట్ పెంచుకునే పనిలో భాగంగా.. ఇక్కడ మంచి సినిమాలు వచ్చే టైంలోనే అక్కడి సినిమాలను పట్టుకొస్తున్నారు. ఇంతకు ముందు మనం డిస్కర్షన్ పెట్టుకున్నట్లు శివకార్తీకేయన్, దుల్కర్, తేజాలు ఒకే రోజు తమ సినిమాలను దింపి.. కాంపిటీటర్లుగా మారిపోగా ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్, కిరణ్ అబ్బవరం కూడా రంగంలోకి దిగారు.

Aldo Read : RAPO 22 : రాజమండ్రిలో హీరో ‘రామ్’ హొటల్ రూమ్ దగ్గర హైడ్రామా

లవ్ టుడే, డ్రాగన్‌తో జోరు మీదున్న ప్రదీప్ రంగనాథన్ నుండి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు రాబోతున్నాయి. లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ సెప్టెంబర్ 18న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్యూడ్ దీపావళికి అని ఫిక్స్ అయ్యింది. ఇదే టపాసుల పండుగకు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం సిద్ధమవుతున్నాడు. కతో హిట్ కొట్టేసిన కిరణ్ నెక్ట్స్ మూవీ కే ర్యాంప్ కూడా దీవాళికి వస్తున్నట్లు ఎనౌన్స్ చేసింది టీం. ఈ రెండు కూడా లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలే కావడం గమనార్హం. డ్యూడ్ తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు.

Also Read : Exclusive : డిజాస్టర్ ఎఫెక్ట్.. కొరటాలకు హీరోల కష్టాలు..

ప్రదీప్, కిరణ్ మాత్రమే కాదు.. దీపావళికి మరొకరు కూడా కర్చీఫ్ వేసే ఛాన్స్ ఉంది. కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీల్లో ఒకరు టపాసుల పండుగకు రాబోతున్నారు. సర్దార్ 2 కానీ, సూర్య- ఆర్జే బాలాజీ కాంబోలో వస్తున్న కరుప్పు కానీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వీటిల్లో ఏదీ వచ్చినా పాన్ ఇండియా చిత్రాలుగా రిలీజ్ అయ్యే ఛాన్సులున్నాయి. సో ఈ లెక్కన ఈ త్రీ ఫిల్మ్స్ దీవాళికి వస్తే.. థియేటర్ల ఇష్యూతో పాటు కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా సౌత్ సినిమాలే రిలీజుల విషయంలో దెబ్బలాడుకుంటే.. కలెక్షన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్‌లో కూడా రాను రానూ నెగిటివ్ ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉంటుంది. నార్త్‌లో స్టార్ హీరో సినిమాలొస్తే.. మరో స్టార్ హీరో సినిమా తప్పుకుంటోంది. అక్కడున్న అండర్ స్టాండింగ్ అలాంటిది. మరీ సౌత్‌లో జరుగుతున్న ఈ లెటెస్ట్ పరిణామాలను సీరియస్‌గా తీసుకుని.. టాలీవుడ్, కోలీవుడ్ డిస్కర్షన్ షురూ చేసుకుంటే బెటరన్నది ట్రేడ్ వర్గాల వాదన.

​నార్త్‌పై టాలీవుడ్ క్లియర్ డామినేషన్ చూపించి.. సౌత్ సినిమాల పవర్ చూపిస్తుంటే.. తమిళ తంబీలు తెలుగు చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేస్తున్నారు. సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ కొట్టుకుని బీటౌన్‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఒరవడి ఈ మధ్య మరీ ఎక్కువైంది. తమిళ తంబీలు.. టాలీవుడ్ మార్కెట్ పెంచుకునే పనిలో భాగంగా.. ఇక్కడ మంచి సినిమాలు వచ్చే టైంలోనే అక్కడి సినిమాలను పట్టుకొస్తున్నారు. ఇంతకు ముందు మనం డిస్కర్షన్ పెట్టుకున్నట్లు శివకార్తీకేయన్, దుల్కర్, తేజాలు ఒకే 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *