DNA tests | గుర్తించలేని స్థితిలో పాశామైలారం మృతులు.. డీఎన్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు

Follow

హైదరాబాద్ : పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 45కు పెరిగింది. వారిలో కొందరి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాంతో డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరో 27 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు.
కాగా ప్రమాద స్థలాన్ని మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు కూడా సీఎం వెంట ఉన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చెప్పారు. మృతులకు ఫార్మా కంపెనీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని అన్నారు.
DNA tests | పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 45కు పెరిగింది. వారిలో కొందరి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.