Drishyam 3 Movie: దృశ్యం 3 వచ్చేస్తోంది.. అధికారికంగా ప్రకటించిన మోహన్ లాల్.. ఈసారి..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Drishyam 3 Movie: దృశ్యం 3 వచ్చేస్తోంది.. అధికారికంగా ప్రకటించిన మోహన్ లాల్.. ఈసారి..

భారతీయ సినీపరిశ్రమలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీలలో దృశ్యం ఒకటి. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలను తెలుగుతోపాటు హిందీలోనూ రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా నటించగా.. హిందీలో అజయ్ దేవగణ్, శ్రియా జంటగా నటించారు. మలయాళంతోపాటు తెలుగు, హిందీలోనూ ఈ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దృశ్యం 2కు కొనసాగింపుగా దృశ్యం 3 చిత్రాన్ని తీసుకురాబోతున్నారు. అయితే ఈ మూడో భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో సినీప్రియులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్.

దృశ్యం 3 స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు డైరెక్టర్ జీతూ జోసెఫ్. “గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు. దృశ్యం 3 రాబోతుంది” అంటూ మోహన్ లాల్ ట్వీట్ చేసి మరోసారి ఆసక్తిని రేకెత్తించారు. అలాగే డైరెక్టర్ జీతూ జోసెఫ్, ప్రొడ్యూసర్ ఆంటోని పెరుంబవూర్ తో కలిసి దిగిన ఓ ఫోటోను పంచుకున్నారు. దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో సినిమా మోహన్ లాల్ స్వయంగా ప్రకటించడంతో ఇప్పుడు అభిమానులు ఖుషీ అవుతున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ సైతం దృశ్యం 3పై అప్డేట్ ఇచ్చారు. అయితే ఈసారి మలయాళంలో వచ్చే దృశ్యం 3 సినిమాకు ఇది రీమేక్ కాదు. ఈ చిత్రానికి అజయ్ దేగవణ్ సొంతంగా కథ రాసుకోవడం గమనార్హం. ఇప్పటికే రెండు భాగాలు అందించిన డైరెక్టర్ జీతూ జోసెఫ్ రాసుకున్న పార్ట్ 3కి..హిందీ దృశ్యం 3కి ఎలాంటి సంబంధం లేకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

​సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే సినీప్రియులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు వరుస హిట్స్ అందుకున్న దృశ్యం సినిమాకు మరో సీక్వెల్ రాబోతుంది. అదే దృశ్యం 3. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *