Ekam-Ekadash Yogam | ఏకం-ఏకాద‌శ యోగం.. ఈ మూడురాశుల వారిపై వ‌రాలు కురిపించ‌నున్న శ‌ని, శుక్ర‌గ్ర‌హాలు..!​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Saturn Venus

Ekam-Ekadash Yogam | శ‌ని క‌ర్మ‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, న్యాయానికి ప్ర‌తినిధిగా భావిస్తుంటారు. అయితే, శుక్రుడు, ప్రేమ‌, అందం, భౌతిక సుఖాల‌కు కార‌కంగా పేర్కొంటారు. రెండు స్నేహ‌పూర్వ‌క గ్ర‌హాలు. ఈ శుభ‌కోణంలోకి వ‌చ్చిన‌ప్పుడు.. వాటి శ‌క్తి ఒక‌దానికొక‌టి స‌మ‌తుల్యం చేస్తుంది. జీవితంలో స్థిర‌త్వం, శేయ‌స్సు, స‌మ‌తుల్య‌త‌ను తెస్తుంది. ఈ యోగం ముఖ్యంగా ఆర్థిక విష‌యాలు, సంబంధాలు, సృజ‌న‌త్మాక రంగాల్లో శుభ ఫ‌లితాల‌ను ఇవ్వ‌నున్న‌ది. ఈ యోగం ప్ర‌భావం ముఖ్యంగా చాలాకాలం పాటు క‌ష్ట‌ప‌డి.. ఓపిక‌గా ప‌ని చేసే వ్య‌క్తుల‌పై క‌నిపిస్తుంది. ఏకం-ఏకాదశ యోగం వారి త‌ప‌స్సును నెర‌వేర్చ‌నున్న‌ది. ఈ స‌మ‌యంలో భౌతిక సుఖాలు, స‌మ‌తుల్య‌త‌, ఆర్థిక శ్రేయ‌స్సును పెంచుతుంది. జాత‌కంలో శ‌ని, శుక్రుడు అనుకూలంగా ఉన్న వారికి.. ఈ యోగం జీవితంలో స్థిర‌త్వం, పురోగ‌తి, శ్రేయ‌స్సును పెంచుతుంది.

వృషభ రాశి

01

వృషభ రాశి అధిపతి శుక్రుడు. శనితో శుభ కలయికను ఏర్ప‌రిచిన స‌మ‌యంలో వృష‌భ‌రాశి వారికి ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌నాల‌ను పొందుతారు. ఈ సమయం కెరీర్‌లో పెద్ద విజయాలను సూచిస్తుంది. మీరు ఉద్యోగంలో ఉంటే.. ప్రమోషన్‌తో పాటు కొత్త బాధ్యతలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ వృత్తి జీవితానికి కొత్త దిశను ఇస్తుంది. ఈ సమయం వ్యాపారం చేసే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ‌వుతుంది. ఆదాయంలో నిరంతర పెరుగుదల ఉంటుంది. అంటే పర్స్ ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఖర్చులు సైతం నియంత్రణలో ఉంటాయి. అలాగే, ఈ కాలంలో కొత్త సంబంధాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఇది వ్యక్తిగత, సామాజిక జీవితంలో సానుకూల మార్పులను తీసుకురానున్న‌ది. వివాహ జీవితంలో ఆనందం, సమతుల్యత పెరుగుతుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది.

కన్యరాశి..

06

శని-శుక్రుల కలయిక కన్య రాశి వారికి కెరీర్‌లో కొత్త అవకాశాలను తీసుకురానున్న‌ది. ఎవ‌రైనా తాము చేస్తున్న ఉద్యోగం మార్చుకోవాల‌ని ఆలోచిస్తుంటే.. మీకు ఈ స‌మ‌యం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో మంచి అవ‌కాశం ల‌భిస్తుంది. దాంతో పాటు కొత్త ఆదాయ వ‌న‌రులు ల‌భిస్తాయి. ఇది ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఉంటుంది. పాత పెట్టుబ‌డుల నుంచి మంచి లాభాల‌ను పొందే అవ‌కాశాలున్నాయి. డబ్బులు ఎక్కడో రాకుండా పోయిన‌ట్ల‌యితే.. తిరిగి పొందే అవ‌కాశాలున్నాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ మద్దతుతో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ఈ కలయిక మీకు జీవితంలో స్థిరత్వం, భద్రతను ఇస్తుంది. తద్వారా మునుపటి కంటే ఎక్కువ నమ్మకంగా నిర్ణయాలు తీసుకోగ‌లుగుతారు.

మకరరాశి..

10

మకర రాశి అధిపతి శని. శుక్రుడు శ‌ని గ్ర‌హానికి స్నేహపూర్వక గ్రహం. కాబట్టి ఈ కలయిక మకర రాశి వారికి ముఖ్యంగా ఫలవంతమైందిగా భావిస్తుంటారు. ముఖ్యంగా కళ, డిజైన్, రచన, సంగీతం ఏదైనా సృజనాత్మక రంగంతో సంబంధం ఉన్న వారికి ఈ సమయంలో ఆదాయానికి కొత్త అవ‌కాశాలుంటాయి. మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార భాగస్వామ్యంలోనూ లాభాలుంటాయి. కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే అవ‌కాశాలున్నాయి. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. సంబంధం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో కూడా సామరస్యం ఉంటుంది. అలాగే, మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను వింటారు. ఇంటి వాతావరణాన్ని ఆనందక‌రంగా మారుతుంది.

​Ekam-Ekadash Yogam | శ‌ని క‌ర్మ‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, న్యాయానికి ప్ర‌తినిధిగా భావిస్తుంటారు. అయితే, శుక్రుడు, ప్రేమ‌, అందం, భౌతిక సుఖాల‌కు కార‌కంగా పేర్కొంటారు. రెండు స్నేహ‌పూర్వ‌క గ్ర‌హాలు. ఈ శుభ‌కోణంలోకి వ‌చ్చిన‌ప్పుడు.. వాటి శ‌క్తి ఒక‌దానికొక‌టి స‌మ‌తుల్యం చేస్తుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *