Elite Women’s Boxing | ఫైనల్లో నిఖత్ జరీన్.. టైటిల్ పోరుకు దూసుకెళ్లిన లొవ్లీనా, నీతూ

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Nikhat

Elite Women’s Boxing : ఎలైట్ ఉమెన్స్ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ఇందూర్ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen) జైత్రయాత్ర కొనసాగుతోంది. తన పంచ్ పవర్‌తో వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న ఆమె ఫైనల్లో అడుగుపెట్టింది. సోమవారం జరిగిన 51 కిలోల విభాగం సెమీస్‌లో అలవోకగా గెలుపొందింది. రెండుసార్లు ఛాంపియన్ అయిన ఆమె బాక్సర్ లక్ష్యను 5-0తో చిత్తు చేసి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఫైనల్లో జ్యోతితో అమీతుమీ తేల్చుకోనుంది ఒలింపిక్ విజేత.

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఎలైట్ ఉమెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో నిఖత్ జరీన్ సహా ఫేవరెట్ బాక్సర్లు పంజా విసిరారు. టోక్యోలో కాంస్యం గెలుపొందిన లొవ్లీనా బొర్గొహైన్ (Lovlina Borgohain) సైతం ఫైనల్‌కు ఫైట్‌కు అర్హత సాధించింది. 75 కిలోల విభాగంతో తనకు తిరుగులేదని చాటిన లొవ్లీనా తొలి రౌండ్‌లోనే స్టాపేజ్ ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నేహను ఓడించింది.

Boxers

మూడేళ్ల క్రితం జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో(2022) స్వర్ణంతో మెరిసిన నీతూ గంగా టైటిల్ పోరులో నిలిచింది. ఉత్కంఠగా సాగిన 48 కిలోల సెమీ ఫైనల్లో రైల్వేకు చెందిన మంజూ రాణికి ఆమె చెక్ పెట్టింది. టైటిల్ కోసం నీతూ శాయ్ బాక్సర్ చంచల్‌తో తలపడనుంది. ఇక 80 కిలోల సెమీస్‌లో సత్తా చాటిన స్వీటీ బోరా ఆలిండియా పోలీస్ బాక్సర్ బబితా బిష్త్‌ను ఇంటికి పంపింది.

ఇవి కూడా చదవండి

​Elite Women’s Boxing : ఎలైట్ ఉమెన్స్ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ఇందూర్ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen) జైత్రయాత్ర కొనసాగుతోంది. తన పంచ్ పవర్‌తో వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న ఆమె ఫైనల్లో అడుగుపెట్టింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *