Elon Musk | ఆ బిల్లు ఆమోదిస్తే మరుసటిరోజే.. ది అమెరికా పార్టీ ఏర్పడుతుంది : ఎలాన్‌ మస్క్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Musk Trump

Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే ట్రంప్‌ యంత్రాంగం తీసుకొచ్చిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు (Big Beautiful Bill) విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ బిల్లును మస్క్‌ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో ఈ బిల్లు కారణంగా మిత్రులు కాస్తా శత్రువులయ్యారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుపై మస్క్‌ మరోసారి విరుచుకుపడ్డారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలను తగ్గించి, అమెరికన్ల రుణాన్ని పెంచే ప్రజాదరణ లేని ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే చట్ట సభ సభ్యులను పదవీచ్యుతులను చేస్తానంటూ బెదిరించారు.

ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మరుసటి రోజే తాను కొత్త పార్టీ పెడతానంటూ హెచ్చరించారు. ‘ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం గురించి ప్రచారం చేసి.. ఇప్పుడు చరిత్రలో అతిపెద్ద రుణభారాన్ని పెంచే బిల్లుపై ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్‌ సభ్యుడు సిగ్గుతో తల దించుకోవాలి. ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీకి సమయం ఆసన్నమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. మరుసటి రోజే ‘ది అమెరికా పార్టీ’ ఏర్పడుతుంది’ అని మస్క్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

కాగా, ఇటీవలే ట్రంప్‌ యంత్రాంగం తెచ్చిన ‘బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు’ను మస్క్‌ వ్యతిరేకించడంతోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ బిల్లు విషయంలో ట్రంప్‌పై మస్క్‌ నేరుగానే విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను అభిశంసించి, ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయని, ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరుందని, అందుకే దానిని ఆయన బయటపెట్టడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.

మస్క్‌ పార్టీ ‘ది అమెరికా పార్టీ’?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, టెస్లా అధినేత మస్క్‌ మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకుని మిత్రులిద్దరూ శత్రువులుగా మారిన క్రమంలో మస్క్‌ కొత్త పార్టీకి శ్రీకారం చుడతారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మస్క్‌ ‘ది అమెరికా పార్టీ’ అనే పార్టీ ఏర్పాటు గురించి ఎక్స్‌లో సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై ఆయన ఇప్పటికే సామాజిక మాధ్యమంలో అభిప్రాయ సేకరణ కూడా జరిపారు. దీంతో ఈ మిలియనీర్‌ కొత్త పార్టీ పెట్టడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. తాజాగా వ్యాఖ్యలతో ఆ ప్రచారం నిజమని తేలిపోయింది.

Also Read..

Carolyn Levitt | ఇండో-పసిఫిక్‌లో భారత్‌ వ్యూహాత్మక మిత్రదేశం : కరోలిన్‌ లెవిట్‌

ఉపగ్రహం సాయంతో.. 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ!

బ్లాకౌట్‌ బాంబ్‌!.. మిస్టీరియస్‌ మిసైల్‌ను ప్రదర్శించిన డ్రాగన్‌

​Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే ట్రంప్‌ యంత్రాంగం తీసుకొచ్చిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు (Big Beautiful Bill) విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *