Elon Musk: సెనెట్‌లో బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు ఆమోదం.. మండిపడిన ఎలాన్ మస్క్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Elon Musk Criticizes Big Beautiful Bill Once Again

Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్‌ పాలకవర్గం తీసుకొచ్చిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా ఈ బిల్లుపై సెనెట్‌లో ఓటింగ్‌ జరగడానికి కొన్ని గంటల ముందు ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు మస్క్.. ఈ బిల్లు అమెరికాలోని మిలియన్ల మంది ఉద్యోగాలను నాశనం చేస్తుందని అందులో రాసుకొచ్చాడు. దీని వల్ల దేశానికి అపారమైన నష్టం కలిగిస్తుందన్నారు ఎలాన్ మస్క.

Read Also: DilRaju : సినిమాల్లోకి రావాలనుకునే వారికోసం ‘దిల్ రాజు డ్రీమ్స్’

అయితే, ఈ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ ఒక విధ్వంసకర చర్య అని మస్క్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అమెరికాలోని పరిశ్రమలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మరో పోస్టులో ఈ బిల్లు రిపబ్లికన్‌ల యొక్క రాజకీయ ఆత్మహత్యగా పేర్కొంటూ నిర్వహించిన పోల్‌ను ప్రస్తావించారు. ఇది రుణ పరిమితిని 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. కాగా, ట్రంప్ తీసుకొచ్చిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన ఈ ఓటింగ్‌లో 51-49 తేడాతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లుపై డెమోక్రట్లందరూ తీవ్రంగా వ్యతిరేకించారు.

​ఈ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ ఒక విధ్వంసకర చర్య అని మస్క్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అమెరికాలోని పరిశ్రమలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మరో పోస్టులో ఈ బిల్లు రిపబ్లికన్‌ల యొక్క రాజకీయ ఆత్మహత్యగా పేర్కొంటూ నిర్వహించిన పోల్‌ను ప్రస్తావించారు. ఇది రుణ పరిమితిని 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *