Encounter | దండకారణ్యంలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

Follow

కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 1: ఒడిశా దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) ఒక మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడితో సహా పార్టీ సభ్యుడు మృతి చెందారు. ఈ ఘటన కంధమల్ జిల్లా లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశా రాష్ట్రం కంధమల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖాలద గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారాసపడి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పును ప్రారంభించారు.
జవాన్ల దాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. మృతి చెందిన వారిలో కేకేబీఎన్ డివిజన్ ఏరియా కమిటీ సభ్యుడు మంకు కాగా పార్టీ సభ్యుడు చందన్ గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలం నుంచి ఒక 303 రైఫిల్, ఒక పిస్టల్ తో పాటు మావోయిస్టులకు సంబంధించిన ఇతర ఆయుధ వస్తు, సామాగ్రిని జవాన్లు స్వాధీనపరుచుకున్నారు.
ఒడిశా దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) ఒక మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడితో సహా పార్టీ సభ్యుడు మృతి చెందారు. ఈ ఘటన కంధమల్ జిల్లా లో సోమవారం చోటుచేసుకుంది.