ENG vs IND : దురదృష్టం అంటే కరుణ్ నాయర్‌దే.. ప్రాక్టీస్‌లో గాయం..! తొలి టెస్టుకు డౌటే..!

Follow

తన మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించి, ఆ తర్వాత నిలకడ తప్పడంతో జట్టుకు దూరమయ్యాడు కరుణ్ నాయర్. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అవకాశం అందుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌లో అతడు మూడో స్థానంలో ఆడే అవకాశం ఉంది. దేశవాళీల్లో పరుగుల వరద పారించి లేక లేక దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో అతడు ఉన్నాడు.
ఈ క్రమంలో నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నాడు. అయితే.. బ్యాటింగ్ సాధన చేస్తుండగా అతడు గాయపడినట్లు తెలుస్తోంది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతిని ఆడే క్రమంలో బాల్ అతడి పక్కటెముకలను బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడాడు. బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ వెంటనే అతడి వద్దకు వెళ్లి ఇప్పుడు ఎలా ఉంది అంటూ అతడి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాడు. కొన్ని క్షణాల తరువాత కరుణ్ నాయర్ బ్యాటింగ్‌ను తిరిగి కొనసాగించాడు.
The incident where Karun Nair got hit at the nets by a delivery from @prasidh43 @RohanDC98 #ENGvsIND #Headingley pic.twitter.com/xGMsiSF8PA
— RevSportz Global (@RevSportzGlobal) June 18, 2025
అయితే.. అతడు నొప్పితో కాస్త ఇబ్బంది పడినట్లుగానే కనిపిస్తోంది. గాయం మరీ తీవ్రమైనది కాకపోవచ్చునని తెలుస్తోంది. ఒకవేళ అతడి గాయం తీవ్రమైనది అయి, అతడు తొలి టెస్టుకు దూరం అయితే మాత్రం భారత్‌కు అది ఖచ్చితంగా ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్‌మెంట్ కావడంతో అనుభలేమీతో ఉన్న బ్యాటింగ్ లైనప్‌లో నాయర్ దూరం అయితే మరింత డీలా పడడం ఖాయం.
ENG vs IND : భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్.. ఫ్రీగా మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
కరుణ్ నాయర్ ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 6 టెస్టులు ఆడాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 62.3 సగటుతో 374 పరుగులు చేశాడు.
తన మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించి, ఆ తర్వాత నిలకడ తప్పడంతో జట్టుకు దూరమయ్యాడు కరుణ్ నాయర్