ENG vs IND: బీసీసీఐది సరైన నిర్ణయం కాదు: డివిలియర్స్

Follow

ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడని తెలుస్తోంది. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు. తాను అన్ని మ్యాచ్‌లు ఆడలేనని సిరీస్‌కు ముందే బుమ్రా చెప్పగా.. అందుకు బీసీసీఐ ఒకే చెప్పింది. బీసీసీఐపై నిర్ణయంపై తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. బీసీసీఐది సరైన నిర్ణయం కాదని అతడు అభిప్రాయపడ్డాడు.
Also Read: Rohit Sharma: ఏవేవో ఆలోచనలు.. కాళ్లు, చేతులు ఆడలేదు!
ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అద్భుతమైన బౌలర్. ఇంగ్లండ్‌లో అతడిని కేవలం మూడు టెస్టుల్లోనే ఆడించడం సరైన నిర్ణయం కాదు. టెస్ట్ క్రికెట్ అత్యున్నతమైనది. అందుకే బుమ్రాను ఈ సిరీస్‌లోని అన్ని టెస్టుల్లో ఆడించాలి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విశ్రాంతి ఇవ్వాలనుకుంటే.. అంతగా ప్రాముఖ్యం లేని టీ20, వన్డేల్లో ఆడించొద్దు. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు డేల్ స్టెయిన్‌ను అలానే ఆడించేవాళ్లం. వర్క్‌లోడ్ నేపథ్యంలో స్టెయిన్‌ను ప్రాముఖ్యత లేని టీ20, వన్డే సిరీస్‌లలో విశ్రాంతి ఇచ్చి.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్‌తో జరిగే పెద్ద టెస్ట్ సిరీస్‌లలో ఆడించేవాళ్ళం. భారత్ యాజమాన్యం బుమ్రాకు టెస్ట్‌ల్లో విశ్రాంతినిస్తోంది. బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడొద్దని వైద్యుడు సూచించి ఉంటాడేమో. అదే నిజమైతే.. దాన్ని మనం గౌరవించాలి’ అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడని తెలుస్తోంది. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు. తాను అన్ని మ్యాచ్‌లు ఆడలేనని సిరీస్‌కు ముందే బుమ్రా చెప్పగా.. అందుకు బీసీసీఐ ఒకే చెప్పింది. బీసీసీఐపై