ENG vs IND 1st Test : టీమ్ఇండియాకు సవాల్ విసిరిన ఇంగ్లాండ్.. తొలి టెస్టుకు రెండు రోజుల ముందే తుది జట్టు ప్రకటన..

Follow

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం (జూన్ 20) నుంచి ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో శుభారంభాన్ని అందుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక రెండు జట్లు కూడా ఈ సిరీస్‌తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్ ను ప్రారంభించనున్నాయి.
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పేయడంతో భారత జట్టు వారి స్థానాల్లో ఎవరిని ఆడించాలి. ఏ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం ఓ అడుగుముందుకు వేసింది.
Team news from Leeds ahead of a BIG week
Ready to face @BCCI
— England Cricket (@englandcricket) June 18, 2025
తొలి టెస్టు మ్యాచ్‌కు రెండు రోజుల ముందే ( బుధవారం జూన్18న) తమ తుది జట్టును ప్రకటించింది. బెన్‌స్టోక్స్ సారథ్యంలో బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్ జట్టులో పెద్దగా మార్పులు ఏమీ లేదు. గాయం కారణంగా జట్టుకు దూరమైన క్రిస్‌వోక్స్ రెండేళ్ల తరువాత టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు.
ఆల్‌రౌండర్ జాకబ్ బెతెల్‌కు చోటు దక్కలేదు. జాక్ క్రాలే, బెన్ డకెట్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా మూడో స్థానంలో ఓలీ పోప్ ఆడనున్నాడు. ఆతరువాత వరుసగా రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్‌లు బరిలోకి దిగనున్నారు. ఏకైక స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ చోటు దక్కించుకున్నాడు. క్రిస్ వోక్స్‌తో పాటు బ్రైడన్ కార్సే, జోష్ టంగ్ లు పేస్ బాధ్యతలను మోయనున్నారు.
తొలి టెస్టుకు ఇంగ్లాండ్ తుదిజట్టు ఇదే..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
భారత్‌తో తొలి టెస్టుకు రెండు రోజుల ముందే ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది.