Euphoria: 20 మంది కొత్త వారిని ప‌రిచ‌యం చేశా.. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Director Gunasekhar Youthful Drama Euphoria Unveils Rama Rama Song

Euphoria: డిఫరెంట్ కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌ గా పేరు పొందిన గుణశేఖర్ తాజాగా యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా ‘యుఫోరియా’ తెరెకెక్కిస్తున్నారు. సమకాలీన అంశాలతో, లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్‌ కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా నుంచి విడుద‌లైన గ్లింప్స్‌, పాటతో మంచి బ‌జ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రామ రామ..’ సాంగ్‌ను మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో నటి భూమిక‌, విఘ్నేష్ గ‌విరెడ్డి, రోహిత్‌, డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌, నీలిమ గుణ, ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి, ఆదిత్య మ్యూజిక్ మాధ‌వ్‌, మాస్ట‌ర్‌ ఆరుష్‌, యానీ మాస్ట‌ర్ మరికొందరు పాల్గొన్నారు.

Read Also: Eatala Rajendar: హైడ్రా దుర్మాగమైన ఆలోచన.. ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు..

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. నాతో పాటు రాగిణి, నీలిమ, యుక్త కలిసి ‘యుఫోరియా’ సినిమాను తీశారని.. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూసేలా తెర‌కెక్కించామని అయన అన్నారు. ప్రేక్షకులు క‌నెక్ట్ అయ్యేలా, ఆహ్లాదక‌రంగా మంచి మెసేజ్‌తో సినిమాను తెర‌కెక్కించామన్నారు. ఇదివరకే విడుదలైన ‘ఫ్లై హై’ అనే పాట‌తో అంద‌రినీ మెప్పించిన కాల భైర‌వ.. ఇప్పుడు మరోమారు ‘రామ రామ’ అనే సాంగ్‌తో మ‌న ముందుకు వ‌చ్చారన్నారు.

Read Also: Iran Israel Conflict: ఇరాన్ అధ్యక్షుడుతో ఫోన్‌లో మాట్లాడిన పీఎం మోడీ.. కీలక సూచన

చైత‌న్య ప్ర‌సాద్ ఈ పాట‌కు మంచి సాహిత్యాన్ని అందించారని.. తప్పకుండా అంద‌రూ ఎంజాయ్ చేసేలా పాట ఉంటుందన్నారు. ప్ర‌వీణ్ పూడి వంటి టెక్నీషియ‌న్‌తో వ‌ర్క్ చేయ‌టం చాలా సంతోషమని.. ప్ర‌వీణ్ కె.పోత‌న్ అనే సినిమాటోగ్రాఫ‌ర్‌ను ఈ సినిమాతో ప‌రిచ‌యం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో దాదాపు 20 మంది కొత్త వారిని ప‌రిచ‌యం చేశానని దర్శకుడు తెలిపారు. సినిమాలో విఘ్నేష్ గ‌విరెడ్డి క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నట్లు తెలిపారు. అతడు మ‌న‌సు పెట్టి న‌టించాడని.. మిగితావారు కూడా చ‌క్క‌గా న‌టించారన్నారు. చాలా రోజుల‌ త‌ర్వాత భూమిక ఈ సినిమా ద్వారా మంచి పాత్ర‌లో రీ ఎంట్రీ ఇచ్చారన్నారు.

​Euphoria: డిఫరెంట్ కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌ గా పేరు పొందిన గుణశేఖర్ తాజాగా యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా ‘యుఫోరియా’ తెరెకెక్కిస్తున్నారు. సమకాలీన అంశాలతో, లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్‌ కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా నుంచి విడుద‌లైన గ్లింప్స్‌, పాటతో మంచి బ‌జ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రామ రామ..’ సాంగ్‌ను మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందుకు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *