Express Hari : నా చేతికి గజ్జి వచ్చింది.. తినడానికి ఎవరైనా ఓ 10 రూపాయలు ఇస్తే బాగుండు.. తన కష్టాలు చెప్తూ ఎక్స్‌ప్రెస్ హరి ఎమోషనల్..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Express Hari Says about his Bad Phase in School and Collage Time

Express Hari : పటాస్ షోలో రచయితగా, కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎక్స్‌ప్రెస్ హరి ఆ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలలో రైటర్ గా, కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా ఎక్స్‌ప్రెస్ హరి ఆహా కాకమ్మ కథలు షోకి హాజరయ్యాడు. ఈ షోలో తన చిన్నతనం, కాలేజీ ఏజ్ లో పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.

ఎక్స్‌ప్రెస్ హరి మాట్లాడుతూ.. మా నాన్న రైతు. అమ్మనాన్న ఇద్దరూ పొలం పనులకు వెళ్లేవారు. నేను, మా చెల్లి. ఇద్దర్ని చదివించే స్థోమత లేదు. అందుకే చిన్నప్పుడే రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రీగా ఫుడ్, చదువు చెప్తారని. అక్కడ 250 మంది ఉంటారు. స్నానం చేయడానికి 8 ట్యాప్ లే ఉంటాయి. అందులో నాలుగే పనిచేస్తాయి. గంటలో అందరూ స్నానం చేసేయాలి. అక్కడ ఎలా బతికామో కూడా తెలీదు. ఎక్కువ రోజులు స్నానం చేయక కుడిచేతికి గజ్జి వచ్చింది. అన్నం తింటుంటే ఆ బ్లడ్ అన్నంలో పడేది. ఉదయం నాలుగు ఇడ్లిలు పెట్టేవాళ్ళు. అందరం పొద్దున్నే పల్లాలు పట్టుకొని టిఫిన్ ఏం పెడతారో అని ఎదురుచూసేవాళ్ళం. కానీ అలాంటి ఫుడ్ తిన్నా, అలా బతికినా బాగా చదువు చెప్పేవాళ్ళు, చదువుకునేవాళ్ళం.

Also Read : Kirrak Seetha Birthday : బిగ్ బాస్ బ్యాచ్ తో ‘కిరాక్ సీత’ బర్త్ డే సెలబ్రేషన్స్.. విష్ణుప్రియ, మణికంఠ.. ఇంకా ఎవరెవరు వచ్చారంటే..

మా నాన్న సంవత్సరానికి ఒక 40 వేలు సంపాదించేవాడు. స్కూల్ లో బాగా చదివినా నేను ఇంటర్ లో జాయిన్ అయితే అక్కడ సంవత్సరానికి 50 వేలు ఫీజు. అయినా నాన్న జాయిన్ చేసాడు. అక్కడేమో నాకు ఇంగ్లీష్ అర్ధమయ్యేది కాదు. రిగ్రెట్ ఫీల్ అయ్యా. నాన్న డబ్బులు కడుతున్నాడని అయినా కష్టపడి చదివా. ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాలేదు. వైజాగ్ దగ్గర ఓ చిన్న కాలేజీలో బిటెక్ జాయిన్ అయ్యా. రూమ్ లో ఉండేవాడిని. మా నాన్న నెలకు 5000 ఇచ్చేవాడు. అది రూమ్ రెంట్ కి వెళ్లిపోయేది. మధ్యాహ్నం ఎవడైనా ఓ పది రూపాయలు ఇస్తే చపాతీ కొనుక్కుందాం, ఆకలి తీర్చుకుందాం అనుకునేవాడిని. ఎవడూ ఇచ్చేవాడు కాదు. నీళ్లు తాగి చదువుకునేవాడ్ని. ఇండస్ట్రీకి వచ్చాకే సంపాదించడం మొదలుపెట్టా అంటూ తన జీవితంలోని కష్టాల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Pawan Kalyan : మురుగన్ నేలపై అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. పంచెకట్టుతో లుక్ అదుర్స్..

​తన చిన్నతనం, కాలేజీ ఏజ్ లో పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చాడు ఎక్స్‌ప్రెస్ హరి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *