Extra Marital Affair: 45 ఏళ్ల వివాహిత.. వాటర్ సప్లయర్ తో ప్రేమాయణం.. భర్తకు తెలియడంతో..
Follow

రాజస్థాన్‌లోని ఝుంఝునులో, పూనమ్ అనే 45 ఏళ్ల మహిళ తనకంటే 14 సంవత్సరాలు చిన్నవాడైన వాటర్ సప్లయర్ కృష్ణ కుమార్‌తో ప్రేమాయణం నడిపింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో ఆ మహిళ, తన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపేసింది. హత్య తర్వాత, ప్రమాదంగా చూపించడానికి ప్రయత్నించారు. పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేయడంతో అసలు యవ్వారం బయటపడింది. ఈ కేసులో నిందితురాలు మహిళ పూనమ్, ఆమె ప్రేమికుడు కృష్ణ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read:Shekar kamula : ఫైనల్‌గా ‘లీడర్ 2’పై క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల!
జూన్ 10 రాత్రి ఝుంఝునులోని గోహానాలోని పచేరి రోడ్డులో ఒక వ్యక్తి మృతదేహం గుర్తించారు. ఆ మృతదేహాన్ని అనూప్ సింగ్ యాదవ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అనూప్ కుమార్తె తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా, పోలీసులు అనూప్ భార్య 45 ఏళ్ల పూనమ్‌ను ప్రశ్నించారు. దీనితో పాటు, కాల్ వివరాలు, ఇతర ఆధారాలను సేకరించారు, దాని ఆధారంగా పోలీసులు పూనమ్ ప్రేమికుడు కృష్ణ కుమార్‌ను అరెస్టు చేశారు.
Also Read:SSMB 29 : SSMB 29 : జక్కన్న.. నువ్వు మామూలోడివి కాదయ్యా
పోలీసులు పూనమ్, ఆమె ప్రేమికుడు కృష్ణ కుమార్‌లను విచారించినప్పుడు సంచలన విషయాలు వెలుగుచూశాయి. జూన్ 10న అనూప్ ఇంటికి చేరుకున్నాడని వారిద్దరూ పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత రాత్రి నడక కోసం బయటకు వెళ్లాడని తెలిపారు. ఈ క్రమంలో అతనికి మద్యం తాగించిన కృష్ణ కుమార్, అనూప్ ఛాతీపై ఇనుప సుత్తితో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అనూప్ మరణించాడు. ఆతర్వాత, కృష్ణ కుమార్ మృతదేహాన్ని రోడ్డు పక్కన విసిరి పారిపోయాడు.
Also Read:Trump: ఇరాన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా.. దాడి ప్రణాళికకు ట్రంప్ ఆమోదం
పోలీసుల దర్యాప్తులో కృష్ణ కుమార్ పూనమ్ కంటే 14 సంవత్సరాలు చిన్నవాడని తేలింది. అతను ఆ మహిళ ఇంటికి ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసేవాడు. పూనమ్, కృష్ణ కుమార్ 2018 సంవత్సరంలో కలుసుకున్నారు. ఆ సమయంలో కృష్ణ కుమార్ వయసు 24 సంవత్సరాలు. పరిచయం కాస్త ప్రేమగా మారి అక్రమసంబంధానికి దారితీసింది. అనుప్ లేని సమయంలో కృష్ణ కుమార్ పూనమ్ ఇంటికి వచ్చేవాడు. పూనమ్, కృష్ణ కుమార్ మధ్య 7 సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఘటనకు ముందు అనుప్ తన ఉద్యోగాన్ని వదిలి 4 నెలలుగా ఇంట్లోనే ఉన్నాడు. ఈ సమయంలో కృష్ణ కుమార్, పూనమ్ ఒకరినొకరు కలుసుకోవడం కష్టంగా మారింది.
Also Read:Trump: ఇరాన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా.. దాడి ప్రణాళికకు ట్రంప్ ఆమోదం
కొంతకాలం క్రితం, పూనమ్, కృష్ణ కుమార్ ల అక్రమ సంబంధం గురించి అనుప్ కు తెలిసింది. దీంతో పూనమ్, అనుప్ మధ్య రోజూ గొడవలు జరిగేవి. భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించిన పూనమ్, ఆమె ప్రేమికుడు కృష్ణ కుమార్ కలిసి అనుప్ ను అంతమొందించడానికి పథకం వేశారు. జూన్ 9న పూనమ్, కృష్ణ కుమార్ అనుప్ ను అంతమొందించడానికి పథకం వేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ సంఘటన జూన్ 10న జరిగింది. పోలీసులు పూనమ్, ఆమె ప్రేమికుడు కృష్ణ కుమార్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారిని పోలీసు రిమాండ్ కు పంపింది.
రాజస్థాన్‌లోని ఝుంఝునులో, పూనమ్ అనే 45 ఏళ్ల మహిళ తనకంటే 14 సంవత్సరాలు చిన్నవాడైన వాటర్ సప్లయర్ కృష్ణ కుమార్‌తో ప్రేమాయణం నడిపింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో ఆ మహిళ, తన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపేసింది. హత్య తర్వాత, ప్రమాదంగా చూపించడానికి ప్రయత్నించారు. పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేయడంతో అసలు యవ్వారం బయటపడింది. ఈ కేసులో నిందితురాలు మహిళ పూనమ్, ఆమె ప్రేమికుడు కృష్ణ కుమార్‌లను పోలీసులు