Falsa Fruits | ఈ పండ్లు మీకు ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తినండి.. ఎందుకంటే..?

Follow

Falsa Fruits | మార్కెట్‌లో మనకు రకరకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. సీజన్లను బట్టి కూడా కొన్ని రకాల పండ్లు లభిస్తాయి. అయితే చాలా మందికి తెలియని పండ్లు కూడా ఉన్నాయి. వాటిల్లో ఫల్సా అనే పండ్లు కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ పండ్లు తియ్యని, పుల్లని రుచిని కలిగి ఉంటాయి. చూసేందుకు పర్పుల్ రంగులో ఉంటాయి. ఇవి వేసవి కాలం సీజన్‌లో లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో మనం ఈ పండ్లను ఎక్కువగా చూడవచ్చు. ఫల్సా పండ్లు వాస్తవానికి ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఫల్సా పండ్లను 100 గ్రాముల మేర తింటే సుమారుగా 50 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పండ్లలో నీరు అధికంగా ఉంటుంది. పిండి పదార్థాలు 13 గ్రాములు, ఫైబర్ 5 గ్రాములు, ప్రోటీన్లు 1 గ్రాము, కొవ్వు 1 గ్రాము కన్నా తక్కువగా ఉంటుంది.
ఎముకల ఆరోగ్యానికి..
ఫల్సా పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫల్సా పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో అనేక రకాల బి విటమిన్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు బి1, బి2, బి3 మనకు ఈ పండ్ల ద్వారా లభిస్తాయి. ఫల్సా పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. ఈ పండ్లలో ఉండే ఐరన్ రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఫల్సా పండ్లలో అధికంగా ఉండే క్యాల్షియం మన ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుండె ఆరోగ్యంగా..
ఈ పండ్లలో ఫాస్ఫరస్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది కూడా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలోని మెగ్నిషియం కండరాల నొప్పులను తగ్గిస్తుంది. దీంతో రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోవడం తగ్గుతుంది. అలాగే మెడ, భుజాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండ్లలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది కనుక కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా నిర్భయంగా తినవచ్చు. ఫల్సా పండ్లలో జింక్, కాపర్, మాంగనీస్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫల్సా పండ్లలో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు కనుక ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
రోగ నిరోధక శక్తికి..
ఫల్సా పండ్లలో నీరు అధికంగా ఉంటుంది కనుక ఈ పండ్లను తింటే డీహైడ్రేషన్ తగ్గుతుంది. శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందవచ్చు. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఫల్సా పండ్లలో ఉండే విటమిన్ సి, ఇతర మినరల్స్ రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫల్సా పండ్లలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ పండ్లను తింటుంటే పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీని వల్ల మలబద్దకం తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాగే గ్యాస్ వల్ల గుండెలో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఇలా ఫల్సా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
మార్కెట్‌లో మనకు రకరకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. సీజన్లను బట్టి కూడా కొన్ని రకాల పండ్లు లభిస్తాయి. అయితే చాలా మందికి తెలియని పండ్లు కూడా ఉన్నాయి. వాటిల్లో ఫల్సా అనే పండ్లు కూడా ఒకటని చెప్పవచ్చు.