Fear of war: ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ భయం..ఆర్థిక నిపుణుల సూచనలు ఇవే..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Fear of war: ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ భయం..ఆర్థిక నిపుణుల సూచనలు ఇవే..!

ప్రతి కుటుంబం సుమారు ఆరు నుంచి ఏడాదికి అయ్యే ఖర్చును అత్యవసర నిధిగా దాచుకోవాలి. దాని కోసం సుమారు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు పక్కన పెట్టుకోవాలి. దీనిలో పాటు బంగారు నాణేల కొనుగోలు, సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)లో పెట్టుబడులు ఉపయోగంగా ఉంటాయి. 1962, 1967, 1971 యుద్ద సమయాల్లో బంగారం అత్యంత నమ్మకమైన పెట్టుబడిగా మారింది.

డాక్యుమెంట్లు

ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రపర్చుకోవడం అత్యంత కీలక అంశం. ఆధార్, పాన్, బీమా పత్రాలు, గుర్తింపు పత్రాలను వాటర్ ప్రూఫ్ కవర్లలో దాచుకోవాలి. అలాగే డిజిటల్ గా అంటే డిజిలాకర్, గూగుల్ డ్రైవ్, యూఎస్బీలతో స్టోరేజీ చేసుకోవాలి.

పెట్టుబడులు

అనుకోకుండా యుద్ధం సంభవిస్తే రూపాయి విలువ క్షీణించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మీ పొదుపులో కొంత మొత్తాన్ని యూఎస్ డాలర్, యూరో, సింగపూర్ డాలర్ వంటి విదేశీ కరెన్సీలలో పెట్టుబడి పెట్టండి. మన దేశంలో అనేక బ్యాంకులు విదేశీ కరెన్సీ ఖాతాలను, డిజిటల్ ప్లాట్ ఫామ్ లను అందజేస్తున్నాయి. అలాగే విదేశీ ఈక్విటీలు, బాండ్లలో పెట్టుబడి పెట్టే గ్లోబల్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ లలో డబ్బులను ఇన్వెస్ట్ చేసుకోవాలి.

ఆహార ధాన్యాల నిల్వ

ఇంటిలోని కుటుంబ సభ్యులకు మూడు నుంచి ఆరు నెలల వరకూ సరిపోయేలా ఆహార ధాన్యాలు, పప్పుదినుసులు, బియ్యం, సిలిండర్లను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలి. వీటిని ఇ-కామర్స్ సంస్థల నుంచి ఒకేసారి కొనుగోలు చేస్తే చాలా సొమ్ము ఆదా చేసుకోవచ్చు.

స్థిరత్వం

స్థిరత్వాన్ని అందించే ఎఫ్ఎంసీజీ, ఫార్మాస్యూటికల్స్, ప్రభుత్వ రంగ యుటిలిటీలు తదితర రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రభుత్వ బాండ్లు, ఆర్ బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు, పన్ను రహిత మౌలిక సదుపాయాల బాండ్లు మంచి రాబడినివ్వడంతో పాటు తక్కువ రిస్కు కలిగి ఉంటాయి.

బీమా

మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య, జీవిత బీమాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అనుకోకుండా కలిగే నష్టాల నుంచి అవి ఉపశమనం కలిగిస్తాయి. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారు వీటితో పాటు ఇంటి బీమా పాలసీలను తీసుకోవడం ఉత్తమం.

ప్రత్యామ్నాయ ఆదాయం

ఒక జీతంపై ఆధారపడేవారు ప్రత్యామ్నాయ ఆధార వనరును కూడా వెతుక్కోవాలి. రిమోట్ ఫ్రీలాన్సింగ్, కంటెంట్ డెవలప్మెంట్, బోధన వంటిని ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే యుద్ద సమయంలో రవాణా, ఆతిథ్యం, నిర్మాణ రంగాలు మూతపడతాయి. వాటిపై ఆధారపడిన వారికి ఉపాధి ఉండదు.

తరలింపు

అత్యవసర సమయంలో ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం చాలా అవసరం. దాని కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. బంధువులు, బ్యాంకులు, బీమా సంస్థలతో సంప్రదించడానికి వీలుగా చిరునామాలు, ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యుద్ద భయం నెలకొంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటూ విధ్వంసం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయిల్- పాలస్తీనా, ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య భీకరంగా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. అప్పటి వరకూ భవనాల్లో విలాసవంతమైన జీవితం గడిపినవారు సైతం నేడు ఆస్తులు, డబ్బును పోగొట్టుకుని ఇతర దేశాలు అందించే ఆహారం కోసం ఎదురుచూస్తున్న ఘటనలు మనకు పేపర్లు, టీవీల్లో ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని ఆర్థిక కొందరు నిపుణులు పలు విలువైన సూచనలు చేస్తున్నారు. భారతీయులు తమ పొదుపులను కాపాడుకోవడానికి, ఆస్తులను భద్రపర్చుకోవడానికి, యుద్ద సమయంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. పొదుపు, పెట్టుబడులు, డాక్యుమెంట్లు, బీమా తదితర వాటి విషయంలో వారిచ్చే సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *