Gadwal Murder : పెళ్లైన తరువాత ప్రియుడితో 2000 ఫోన్ కాల్స్.. వెలుగులోకి కీలక విషయాలు

Follow

Gadwal Murder : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసు మొదట కనిపించినంత సాధారణం కాకుండా, దాని వెనుక ఉన్న కథనం ఆవిష్కరించబడుతున్న కొద్దీ నోరెళ్లబెట్టే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 32 ఏళ్ల తేజేశ్వర్‌కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లికి కేవలం ఐదు రోజులు ముందు ఐశ్వర్య అనూహ్యంగా అదృశ్యమైంది. ఆమె కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందని అనుమానాలు తలెత్తాయి.
అయితే ఫిబ్రవరి 16న తిరిగి ఇంటికి వచ్చిన ఐశ్వర్య, తేజేశ్వర్‌ను ఫోన్‌లో నమ్మించి, ప్రేమగా ప్రవర్తిస్తూ, కట్నం ఇవ్వలేక ఇబ్బంది పడుతుంటే బంధువుల ఇంటికి వెళ్లిపోయానని, కుటుంబ సమస్యల వల్లే వెళ్లానని పేర్కొంది. తేజేశ్వర్ మళ్లీ నమ్మి, మే 18న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన వెంటనే, ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా తన ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుతుండడంతో మనస్పర్థలు మొదలయ్యాయి. అదే సమయంలో తేజేశ్వర్ ఆకస్మికంగా జూన్ 17న కనిపించకుండా పోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అతడి కుటుంబ సభ్యులు అనంతరం గద్వాలలో మృతదేహంగా గుర్తించారు.
AK 64 : అజిత్ నెక్ట్స్ సినిమా.. మైత్రీ ఔట్.. వేల్స్ ఇన్
పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని అదే బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమెకు, బ్యాంకులోని ఓ ఉద్యోగికి వివాహేతర సంబంధం ఉండగా, అదే ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య, ఆ ఉద్యోగితో 2,000కు పైగా ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా విశ్లేషణలో వెల్లడైంది. తేజేశ్వర్ హత్యకు అదే బ్యాంకు ఉద్యోగి సుపారీ ఇచ్చినట్టు, తన డ్రైవర్‌ను హంతకుల వెంట పంపినట్టు పోలీసులు వెల్లడించారు.
జూన్ 17న కొంతమంది తేజేశ్వర్‌ను కలిసి భూమి కొలత అవసరమని నమ్మించి కారు ఎక్కించుకున్నారు. కారులోనే గొంతు కోసి హత్య చేసి, పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద మృతదేహాన్ని పడేసారు. ప్రస్తుతం ఆ బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉండగా, ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.
Israel PM: యురేనియం ఎక్కడుందో మాకు తెలుసు: ఇరాన్ సీక్రెట్ స్థలంపై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు
Gadwal Murder : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసు మొదట కనిపించినంత సాధారణం కాకుండా, దాని వెనుక ఉన్న కథనం ఆవిష్కరించబడుతున్న కొద్దీ నోరెళ్లబెట్టే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 32 ఏళ్ల తేజేశ్వర్‌కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లికి కేవలం ఐదు రోజులు ముందు ఐశ్వర్య అనూహ్యంగా అదృశ్యమైంది. ఆమె కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో