Gas Cylinder Price | స్వల్పంగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Gascylinder

న్యూఢిల్లీ: వంట గ్యాస్‌ వినియోగదారులు స్వల్ప ఊరట లభించింది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను (Gas Cylinder Price) సవరిస్తున్న దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు.. తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరలను తగ్గించాయి. 19కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.58.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. సవరించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.1723 నుంచి రూ.1665కు చేరింది. కోల్‌కతాలో రూ.1769, చెన్నైలో రూ.1822.50గా ఉన్నది. గత నెల కూడా రూ.24 మేర సిలిండర్‌ ధర తగ్గిన విషయం తెలిసిందే.

కాగా, గృహావసరాలకు ఉపయోగించే 14 కేజీల సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌ ధర రూ.855.50గా ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.50 పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి.

​వంట గ్యాస్‌ వినియోగదారులు స్వల్ప ఊరట లభించింది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను (Gas Cylinder Price) సవరిస్తున్న దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు.. తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరలను తగ్గించాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *