Genelia | ఈ వ‌యస్సులోను ఇంత అంద‌మా.. త‌ట్టుకోలేక‌పోతున్నామంటున్న కుర్రాళ్లు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Genelia

Genelia | తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న‌ ముద్దుగుమ్మ జెనీలియా డిసౌజా. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించిన చిత్రాలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి. 1987, ఆగస్టు 5న జన్మించిన జెనీలియా, ‘తుజే మేరీ కసమ్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇందులో హీరోగా రితేష్ దేశ్ ముఖ్ నటించారు. మొదటి సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ చాలా కాలం కొనసాగి, 2012లో ఇరు కుటుంబాల సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు.

తెలుగులో ‘బాయ్స్’ సినిమాతో అరంగేట్రం చేసిన జెనీలియా, ‘బొమ్మరిల్లు’, ‘సాంబ’, ‘ఆరెంజ్’, ‘నా అల్లుడు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆమె చేసిన పాత్రలు ఎంతో సహజంగా ఉండటంతో అభిమానులు జెనీలియాని తెలుగింటి అమ్మాయిగా భావించారు. ఇక జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. మొదట్లో వారి ప్రేమకు కుటుంబం ఒప్పుకోలేదు. కానీ జెనీలియా మంచితనానికి ఫిదా అయిన విలాస్ రావ్ వారి ప్రేమని అంగీక‌రించి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెళ్లి తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా, ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హిందీలో వరుసగా ప్రాజెక్ట్స్‌ చేస్తూ అల‌రిస్తూ ఉంది. ఇక తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందం, ఆకర్షణలో ఆమె ఇప్పటికీ అప్సరసే అన్నంతగా మెరిసిపోతుంది.ఈ ఏజ్‌లో కూడా జెనీలియా ఇంత గ్లామ‌ర్ ఎలా మెయింటైన్ చేస్తుంది అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం జెనీలియా పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

 

​Genelia | తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న‌ ముద్దుగుమ్మ జెనీలియా డిసౌజా. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించిన చిత్రాలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *