Glutathione: గ్లుటాథయోన్ ట్రెండ్ వెనక నిజాలు: షెఫాలీ జరీవాలా మరణానికి కారణం అదేనా? షాకింగ్ విషయాలు

Follow

గ్లూటాతాయన్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన ‘మేడ్ ఇన్ హైవేను సీజన్ 2’ తరువాత ఈ పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. దీంతోపాటు ఇటీవల మరణించిన నటి షెఫాలీ జరీవాలా పేరు కూడా వినిపిస్తోంది. దీంతో ఈ గ్లూటాతాయన్ అంటే ఏంటి? దీనిని ఎందుకు వాడతారు? అసలు గ్లూటాతాయన్ కు నటి షెఫాలీ జరీవాలా మరణానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి జనాలు ట్రై చేస్తున్నారు.
అసలు గ్లూటాతాయన్ అంటే ఏంటి?
గ్లుటథయోన్ అనేది శరీరంలో సహజంగా తయారయ్యే యాంటీఆక్సిడెంట్. ఇది సిస్టేన్, గ్లూటామేట్, గ్లైసిన్ వంటి అమినో యాసిడ్ల మిశ్రమంతో తయారవుతుంది. దీనిని మెడికల్‌గా లివర్ డిటాక్స్, కీమోథెరపీ సపోర్ట్, అల్జీమర్/పార్కిన్‌సన్ వంటి రుగ్మతలను నయం చేసే చికిత్సలో ఉపయోగిస్తారు. కానీ, ఈ మధ్య కాలంలో చర్మ సౌందర్యానికి కూడా వాడుతున్నారు. చర్మం తెల్లగా చేసేందుకు, యవ్వనం నిలుపుకోవడానికీ ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లువెన్సర్లు గ్లామర్, అందంగా కనిపించేందుకు ఎక్కువగా వాడుతున్నారు. దాంతో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
ఇటీవల విడుదలైన మేడ్ ఇన్ హైవేను సీజన్ 2 వల్ల ఈ గ్లుటథయోన్ గురించి జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ సిరీర్ లో వచ్చిన మొదటి ఎపిసోడ్ లో ఒక పెళ్లికూతురు పెళ్లికి ముందు తన చర్మాన్ని తెల్లగా చేసుకోవడానికి గ్లుటథయోన్ ఇంజెక్షన్ తీసుకుంటుంది. అంతేకాదు ఇది ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్ అని, చాలా సెలబ్రిటీలు తీసుకుంటారు అంటి చెప్తుంది. అలా ఆ పదం ప్రాచుర్యం లోకి వచ్చింది.
షెఫాలీ జరీవాలా మరణానికి కారణం గ్లుటథయోన్:
2025 జూన్ 27న టెలివిజన్ నటి షెఫాలీ జరీవాలా ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణంపై జరిగిన విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నటి షెఫాలీ జరీవాలా గ్లుటథయోన్ ఇంజెక్షన్లు, యాంటీ ఏజింగ్ మందులు వాడుతున్నట్టు తెలిసింది. వాటి డోస్ ఎక్కువ అవడం వల్లే ఆమె మరణం సంభవించినిదని అధికారులు తెలిపారు.
అసలు షెఫాలీ జరీవాలా మరణం సమయంలో ఎం జరిగిందంటే?
నటి షెఫాలీ జరీవాలా శనివారం పూజ కోసం ఉపవాసం ఉన్నారు.
ఖాళీ కడుపుతో గ్లుటథయోన్ ఇంజెక్షన్ తీసుకున్నారు.
దాంతో రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడం
బీపీ కింద పడిపోవడంతో గుండె ఆగిపోయింది.
మితిమీరిన యాంటీఆక్సిడెంట్ ట్రీట్మెంట్లు, IV గ్లుటథయోన్ అప్రూవల్ లేకుండా తీసుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వైద్యులు తెలిపారు. పోలీసులు సైతం తనిఖీల్లో ఆమె ఇంట్లో గ్లుటథయోన్ ఇంజెక్షన్ వైల్స్, యాంటీ ఏజింగ్ పిల్స్, ఇతర విటమిన్లు ఉన్నట్లు గుర్తించారు.
గ్లుటథయోన్ వాడేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- గ్లుటథయోన్ ను ఓరల్ అంటే టాబ్లెట్లు, సబ్బులు, క్రీముల రూపంలోనే వాడాలి.
- అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.
- ఖాళీ కడుపుతో యాంటీ ఏజింగ్ మందులూ తీసుకోరాదు.
- ముఖ్యంగా గ్లుటథయోన్ ను సౌందర్యం కోసం వాడకూడదు
- సలూన్లు, స్పాలు, అన్‌లైసెన్స్‌డ్ క్లినిక్స్ లో గ్లుటథయోన్ ఇంజెక్షన్లు వేయించుకోకూడదు.
- ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య సలహా తీసుకోకుండా మంచిది.
Glutathione: గ్లుటథయోన్ అనేది శరీరంలో సహజంగా తయారయ్యే యాంటీఆక్సిడెంట్. ఇది సిస్టేన్, గ్లూటామేట్, గ్లైసిన్ వంటి అమినో యాసిడ్ల మిశ్రమంతో తయారవుతుంది.