Group-1 : నేడు తెలంగాణ గ్రూప్‌-1 పిటిషన్లపై విచారణ

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Telangana Group 1 Court Hearing Continues

Group-1 : తెలంగాణ గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వాదనలు త్వరగా ముగించాలని సంబంధిత న్యాయవాదులకు కోర్టు సూచించింది. నియామక పత్రాల కోసం అభ్యర్థులు నిరీక్షణలో ఉన్నారని హైకోర్టు గుర్తుచేసింది. పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో లోపాలు, తుది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తేడాలు ఉన్నట్లు పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో, పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున నియామక ప్రక్రియపై స్టే ఆదేశాలు జారీ చేసిన కోర్టు, ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తుపై విచారణ జరుపుతోంది.

Chitty Scam: చిట్టిలపేరుతో 300 మందికి టోకరా.. 4 కోట్ల రూపాయలతో ఉడాయించిన కన్నింగ్ లేడి..!

ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ తరఫున స్టే ఎత్తివేయాలని కోర్టును కోరింది. సోమవారం జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు జీ విద్యాసాగర్, సురేందర్ రావు వాదనలు వినిపించారు. అయితే కోర్టు సమయం ముగియడంతో వాదనలు మంగళవారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మంగళవారం) హైకోర్టు విచారణ కొనసాగించనుంది. ఈ పిటిషన్ల తీర్పు గ్రూప్-1 అభ్యర్థులకు కీలకంగా మారే అవకాశముంది.

Crime News: ఇద్దరు పిల్లలతో సహా భార్యను కోర్టుకు తీసుకెళ్లిన భర్త.. చివరికి..?

​Group-1 : తెలంగాణ గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వాదనలు త్వరగా ముగించాలని సంబంధిత న్యాయవాదులకు కోర్టు సూచించింది. నియామక పత్రాల కోసం అభ్యర్థులు నిరీక్షణలో ఉన్నారని హైకోర్టు గుర్తుచేసింది. పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో లోపాలు, తుది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తేడాలు ఉన్నట్లు పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో, పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున నియామక ప్రక్రియపై స్టే ఆదేశాలు జారీ చేసిన కోర్టు, ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ దాఖలు చేసిన మధ్యంతర 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *