Headingley Test | యశస్వీ హాఫ్ సెంచరీ.. బౌండరీలతో చెలరేగుతున్న గిల్..!​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Yashasvi

Headingley Test : హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51 నాటౌట్) అర్ధ శతకం సాధించాడు. రెండో సెషనలో జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వీ. తద్వారా ఐదు జట్లతో ఆడిన తొలి టెస్టులో నాలుగోసారి యాభై రన్స్‌తో రికార్డు నెలకొల్పాడీ యంగ్‌స్టర్.

లంచ్ లోపే రెండు వికెట్లు పడిన జట్టును కెప్టెన్ శుభ్‌మన్ గిల్(39 నాటౌట్)తో కలిసి ఆదుకునే పనిలో ఉన్నాడు యశస్వీ. మరోవైపు సారథిగా తొలి మ్యాచ్ ఆడుతున్న గిల్.. బౌండరీలతో చెలరేగుతున్నాడు. వోక్స్, టంగ్, స్టోక్స్.. ఎవరినీ వదలకుండా ఉతికేస్తున్నాడు. దాంతో.. భారత్ స్కోర్ 150కి చేరువైంది. ఈ జోడీ ఇప్పటికే 69 బంతుల్లో 52 రన్స్ రాబట్టింది.

రాహుల్ ధనాధన్

తొలి సెషన్‌లో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడిన ఓపెనర్లు ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే.. మరికాసేపట్లో లంచ్ అనగా.. గిల్ సేన వరుసగా రెండో వికెట్ వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ కేఎల్ రాహుల్(42)ను బ్రాండన్ కార్సే ఔట్ చేసి ఆతిథ్య జట్టకు బ్రేకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అరంగేట్రం కుర్రాడు సాయి సుదర్శన్(0) నిరాశపరిచాడు. ఐపీఎల్‌లో దంచికొట్టిన అతడు తన తొలి టెస్టు మ్యాచ్‌లో సున్నాకే పెవిలియన్ చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో సాయి ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా.. వికెట్ కీపర్ ఎడమవైపు డైవ్ చేస్తూ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 92 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు పడ్డాయి.

ఇవి కూడా చదవండి

​Headingley Test : హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51 నాటౌట్) అర్ధ శతకం సాధించాడు. రెండో సెషనలో జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వీ.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *