Health Benefits : ఓ వైపు వర్షాలు.. జలుబు, దగ్గు చిటికెలో తగ్గించే చిట్కా..

Follow

Health Benefits : ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలతో ప్రజలు ఎక్కువగా జలుబు, దగ్గు సమస్యలతోనే బాధపడుతుంటారు. ఇవి రాగానే వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లి పదుల కొద్ది ట్యాబ్లెట్లు, సిరప్ లు తీసేసుకుంటారు. ఇంకేముంది వాటిని వారం రోజులు వేసుకున్నా తగ్గదు. కానీ మన వంటింట్లోనే కొన్ని చిట్కాలతో వీటిని దూరం చేసుకోవచ్చు. జలుబు, దగ్గుకు శొంటి అద్భుతంగా పనిచేస్తుంది. శొంటిని వేడి నీళ్లలో లేదంటే పాలల్లో వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వాటిని తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తాగితే త్వరగా తగ్గుతుంది. పైగా జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ఈ శొంటితో.
read also : Pashamilaram-Incident : రెండు నెలల కిందే పెళ్లి.. సిగాచి మృతుల్లో నవదంపతులు..
తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న చిట్కా. దీనికే బామ్మ చిట్కా అనే పేరు కూడా ఉంది. మార్కెట్లో దొరికే నాలుగు తమలపాకులను గోరువెచ్చగా చేయాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. ఈ రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. లేదంటే ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక చెంచాలో కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి.
ఇలా చేసిన దాన్ని ఉదయాన్నే ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి. గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. ఆ తర్వాత వాటిని వడకట్టి కొంచెం పంచదార కలిపి రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఇలా ఎన్నో చిట్కాలతో మీ జలుబు, దగ్గును చిటికెలోనే తగ్గించుకోవచ్చు.
Health Benefits : ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలతో ప్రజలు ఎక్కువగా జలుబు, దగ్గు సమస్యలతోనే బాధపడుతుంటారు. ఇవి రాగానే వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లి పదుల కొద్ది ట్యాబ్లెట్లు, సిరప్ లు తీసేసుకుంటారు. ఇంకేముంది వాటిని వారం రోజులు వేసుకున్నా తగ్గదు. కానీ మన వంటింట్లోనే కొన్ని చిట్కాలతో వీటిని దూరం చేసుకోవచ్చు. జలుబు, దగ్గుకు శొంటి అద్భుతంగా పనిచేస్తుంది. శొంటిని వేడి నీళ్లలో లేదంటే పాలల్లో వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత